Newer posts are loading.
You are at the newest post.
Click here to check if anything new just came in.

July 17 2018

praveen2017
01:51

ఆర్.నారాయణ మూర్తికి కమ్యూనిజం అంటే ఏమిటో కూడా తెలియదు

నిజ జీవితంలో విప్లవకారులు దొరికితే వాళ్ళని చిత్ర హింసలు పెట్టి బూటకపు ఎంకౌంటర్‌లలో చంపించే ప్రభుత్వం ఆర్.నారాయణ మూర్తి సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్‌లు ఇచ్చిందంటే దాని అర్థం సినిమాలలోని విప్లవకారులకీ, నిజ జీవితంలోని విప్లవకారులకీ మధ్య తేడా ఉన్నట్టే కదా. మాదాల రంగారావు సినిమాలు నేను రెండో మూడో చూసాను. మాదాల రంగారావు కూడా నిజ జీవితంలో విప్లవకారుడేమీ కాదు. సిపిఐ(మావోయిస్ట్) కేంద్ర కమిటీ కార్యదర్శి గణపతి లొంగిపోవాలనుకుంటున్నాడని మాదాల రంగారావు ప్రచారం చేసాడు. అలాంటిదేమీ లేదని గణపతి సమాధానం చెప్పాడు. మాదాల రంగారావుకి మైండ్ చెడింది అని కూడా గణపతి అన్నాడు. దళ కమాండర్ లొంగిపోతేనే పోలీసులు అతనికి మిగితా నాయకుల అడ్రెస్‌లు చెప్పమని హెరాస్ చేస్తారు. నయీం, బయ్యపు సమ్మిరెడ్డి లాంటివాళ్ళు ఇన్‌ఫార్మర్‌లుగా మారినది అందువల్లే కదా. పార్టీ నాయకులందరి అడ్రెస్‌లు తెలిసిన కేంద్ర కమిటీ కార్యదర్శి లొంగిపోతే, అతను మిగితావాళ్ళ అడ్రెస్‌లు చెప్పకపోతే, పోలీసులు అతన్ని బతకనిచ్చే అవకాశం లేదు. ఈ విషయం గణపతికి తెలిసే ఉంటుంది. నయీం, సమ్మిరెడ్డి లాంటివాళ్ళ వ్యవహారం మనకే తెలిసినప్పుడు అది పార్టీ సీనియర్ నాయకులకి తెలియదనుకోలేము. ఎర్ర బ్యానర్ కింద సినిమాలు తీసేవాళ్ళకి మాత్రం ఇవన్నీ తెలియాలని రూల్ లేదు. 

ఆర్.నారాయణ మూర్తికి కూడా కమ్యూనిజం అంటే ఏమిటో తెలియదు. ఆయన ఒక పత్రిక ఇంటర్వ్యూలో తాను మంచి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. ప్రభుత్వం ఉన్నదే సొంత ఆస్తి వ్యవస్థని పరిరక్షించడానికి. సొంత ఆస్తి లేకపోతే పోలీస్ స్టేషన్‌లూ, కోర్ట్‌లూ, తహసీల్‌దార్ ఆఫీసులూ అవసరం ఉండవు. ఈ విషయం నారాయణ మూర్తికి తెలియదు. 

ఆర్.నారాయణ మూర్తి పాలక వర్గ నాయకుడైన కెసిఆర్‌ని పొగడడం గురించి ఒక సారి ఫేస్‌బుక్‌లో చర్చ జరిగింది. పాలక వర్గానికీ, విప్లవకారులకీ మధ్య శత్రుత్వం ఉంటే ప్రభుత్వం ఆర్.నారాయణ మూర్తి సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్‌లు ఎలా ఇచ్చింది అని నేను ఒక వ్యాఖ్యలో అడిగాను. దానికి రామమోహన్ అనే ఆయన సమాధానం వ్రాసాడు "ఆర్.నారాయణమూర్తికి మార్క్సిజం తెలియదు. దానికి ఆయన ఇంటర్వ్యూయే సాక్ష్యం. మార్క్సిజం తెలియకపోవడం తప్పు కాదు. ప్రభుత్వాన్ని కూల్చే రహస్యాన్ని ప్రభుత్వం బయటపడనివ్వదు" అని. ఆ ఇంటర్వ్యూలో నారాయణ మూర్తి ఏమన్నాడు అని రామమోహన్‌ని నేను అడిగాను. తనకి సరిగా గుర్తు లేదు అని రామమోహన్ అన్నాడు.

"జై బోలో తెలంగాణా" సినిమా సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో గొడవ జరిగినప్పుడు కూడా కొందరు అడిగారు "ఎర్ర సినిమాలు చూసి జనం నక్సలైట్లుగా మారుతారనే భయం ప్రభుత్వానికి లేదు కానీ ఒక తెలంగాణావాద సినిమా అంటే ప్రభుత్వానికి ఎందుకంత భయం?" అని. అసలు ఆర్.నారాయణ మూర్తి సినిమాలలో ఏముందో తెలుసుకుందామనే నేను ఆయన నిర్మించిన "అర్ధరాత్రి స్వతంత్రం" సినిమా చూసాను. ఆ సినిమాలో నారాయణ మూర్తి విప్లవకారులని చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేవాళ్ళుగా, పారలెల్ గవర్నమెంట్ నడిపేవాళ్ళుగా చూపించాడు. కమ్యూనిజం రావడం ఏమాత్రం ఇష్టం లేని మహా ధనవంతులు కూడా అలాంటి థీమ్‌తో సినిమా తియ్యగలరు. అందుకే కదా కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన దాసరి నారాయణరావు, తెలుగు దేశం ఎం.పి. అయిన మోహన్ బాబు కూడా ఎర్ర సినిమాలు తియ్యగలిగారు. 

"అర్ధరాత్రి స్వతంత్రం" సినిమాలో ఆర్.నారాయణమూర్తి విప్లవాన్ని ఎలా నేరో వ్యూలో చూపించాడో నేను ఫేస్‌బుక్‌లో వ్రాసాను. అప్పుడు రామమోహన్ నేను అడిగిన పాత ఇంటర్వ్యూ సారాంశాన్ని గుర్తుతెచ్చుకుని వ్రాసాడు. "ఆర్.నారాయణమూర్తి మంచి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాడనేది ఆ ఇంటర్వ్యూ సారాంశం" అన్నాడు రామమోహన్. లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ కూడా మంచి ప్రభుత్వం ఉండాలనే కోరుకుంటాడు. కేవలం మంచి ప్రభుత్వం కావాలంటే లోక్ సత్తానే నమ్ముకుంటే సరిపోతుంది. దాని కోసం ఎర్ర జెండా పట్టుకోవాల్సిన అవసరం లేదు. 

కమ్యూనిజం అంటే సొంత ఆస్తిని రద్దు చెయ్యడం. గ్రీక్ భాషలో కమ్యూనిస్ అంటే ఉమ్మడి అని అర్థం. కమ్యూనిజం అంటే ఉమ్మడి ఆస్తి వాదం. కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్‌గా మారకముందు కూడా కొంత మంది కమ్యూనిస్ట్‌లు ఉండేవాళ్ళు. వాళ్ళు ఊహాస్వర్గ కమ్యూనిస్ట్‌లు & క్రైస్తవ కమ్యూనిస్ట్‌లు. ఊహాస్వర్గ కమ్యూనిస్ట్‌లకి వర్గాల గురించి తెలియదు. శ్రామిక వర్గ పోరాటం అనేది వాళ్ళ థియరీలో ఉండదు. ఊహాస్వర్గ కమ్యూనిస్ట్‌లు కూడా నాయకుడు అవసరం లేని సమాజాన్ని కోరుకుంటారు. ప్రభుత్వం బాగుంటే ప్రజలు బాగుంటారని ఏ కమ్యూనిస్టూ అనుకోడు. ఆర్.నారాయణమూర్తికి కమ్యూనిజం అంటే ఏమిటో కూడా తెలియదు. అతనికి మార్క్సిజం తెలిసే అవకాశం లేదు. అతని సినిమాలు సొంత ఆస్తి సంబంధాలని ఒక ఇంచ్ కూడా కదపలేవు. ఆ సినిమాలకి ప్రభుత్వం సెన్సార్ సర్టిఫికేట్‌లు ఇవ్వడం విచిత్రం కాదు.

ఇండియాలో కమ్యూనిజం అంటే ఏమిటో తెలియనివాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక కమ్యూనిజం గురించి తెలియకపోవడం తప్పు కాదు. కమ్యూనిజం అంటే ఏమిటో తెలిస్తే ఆర్.నారాయణమూర్తి దాన్ని అంగీకరిస్తాడా లేదా అనేదే ఇక్కడి సందేహం. కార్ల్ మార్క్స్ కూడా మొదట్లో కమ్యూనిజంని అంగీకరించలేదు. అతను కొన్ని ఫ్రెంచ్ రచనలు చదివిన తరువాతే కమ్యూనిజంని అంగీకరించాడు. కమ్యూనిజం అంటే ఏమిటో తెలియకుండానే ఎర్ర సినిమాలు నిర్మించిన వ్యక్తికి సడెన్‌గా కమ్యూనిజం అంటే ఏమిటో తెలిస్తే అతను దేన్ని అంగీకరిస్తాడు అనేది సందేహమే. ఉమ్మడి ఆస్తి వ్యవస్థని స్థాపించడం సాధ్యం అని చెపితే మొదట్లో నేను కూడా అంగీకరించలేదు. "కొండలు, గుట్టలు ఉన్న భూమిని సాగు చెయ్యడం కష్టం. ఆ భూమి యొక్క ఉమ్మడి యాజమాన్యాన్ని ఎవరు అంగీకరిస్తారు" లాంటి ప్రశ్నలు నేను కూడా అడిగేవాణ్ణి. ఇప్పుడు నేను కమ్యూనిజంనే సమర్థిస్తాను కానీ కమ్యూనిజం అంటే ఏమిటో తెలియకుండా కమ్యూనిజంని అంగీకరిస్తే దాని వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు అంటాను . 
Tags: Movies

June 28 2018

praveen2017
13:35
ఫేస్‌బుక్‌లో విరసం అభిమానులు నన్ను బ్లాక్ చెయ్యలేదు కానీ అన్‌ఫ్రెండ్ చేసారు. విరసంవాళ్ళు తాము దెయ్యాల తత్వశాస్త్రాన్ని ప్రచురించలేదని చెప్పుకోలేదు. అది కొడవటిగంటిగారి అభిప్రాయం అని మాత్రమే చెప్పుకున్నారు. రచయిత వ్యక్తిగత అభిప్రాయాలని ప్రమోట్ చెయ్యడం విరసం పని కాదు. అందుకే నేను విరసంపై తీవ్ర విమర్శలు చేసాను. దెయ్యాల్ని నిజంగా నమ్మేవాళ్ళైతే ఆ తత్వశాస్త్రాన్ని ప్రచురించొచ్చు. తాము నమ్మినది చెప్పుకోవడం తప్పు కాదు. మరణానంతర జీవితంపై నమ్మకం లేనివాళ్ళకి ఆ థీసిస్‌ని ప్రచురించాల్సిన అవసరం ఏమొచ్చింది? విప్లవకరంగా మాట్లాడితే హెరాస్మెంట్లు, బూటకపు ఎంకౌంటర్లు ఉంటాయనే భయంతో వాళ్ళు విప్లవ వ్యతిరేకమైన దెయ్యాల తత్వశాస్త్రాన్ని ప్రచురించే లెవెల్‌కి దిగారు. విరసం అభిమానులు నన్ను అన్‌ఫ్రెండ్ చేసినందుకు నేను ఇప్పటికీ ఏమాత్రం బాధపడడం లేదు. నాకు ఫ్రెండ్స్ సంఖ్య ముఖ్యం కాదు, కమిట్మెంట్ ఉన్న ఫ్రెండ్స్ కావాలి. 
Tags: Controversy

June 26 2018

praveen2017
03:27
రెంట్ కంట్రోలర్ చట్టం గురించి బాగా తెలిసిన ఒక లాయర్ తన ఇంటిలో అద్దెకి ఉంటున్నవాళ్ళని ఖాళీ చెయ్యించడానికి సివిల్ కోర్ట్‌కి వెళ్ళకుండా సివిల్ సెటిల్మెంట్లు చేసే రౌడీ షీటర్ దగ్గరకి వెళ్తే ఎలా ఉంటుంది? ఒక పోలీస్ ఆఫీసర్ తన భార్యని రేప్ చేసినవాణ్ణి అరెస్ట్ చెయ్యకుండా ఆ రేపిస్ట్‌ని ఒక రౌడీ షీటర్ చేత హత్య చెయ్యిస్తే ఎలా ఉంటుంది? ప్రభుత్వం మీద ఎంత నమ్మకం లేనివాడైనా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడాన్ని సమర్థించడు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ప్రభుత్వ స్కూల్‌లలో విద్యనీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యాన్నీ నిరాకరించేవాళ్ళని మాత్రం సమర్థించొచ్చా? 

2015లో నాకు హైదరాబాద్ నుంచి ఒక పెళ్ళి సంబంధం వచ్చింది. ఆ అమ్మాయికి గర్భ సంచి లేదు. ఆమెకి పిల్లలు పుట్టరు. ఆమెని పెళ్ళి చేసుకుంటే పిల్లల్ని పెంచే ఖర్చు ఉండదు. ఆ లెక్కతో నేను ఆమెని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఆమె ట్రాన్స్‌ప్లాంటెడ్ కిడ్నీతో ఉంది. ఆమె మరో ముప్పైనలభై ఏళ్ళు బతుకుతుందో లేదో తెలియదు. అయినా ఆమెతో కలిసి వెళ్ళిపోవాలని నేను అనుకున్నాను. మా అమ్మ అందుకు ఒప్పుకోలేదు. ఆమె చేసేది ప్రైవేట్ ఉద్యోగం. ఆమె జీతం పది వేలు. హైదరాబాద్‌లో ఇంటి అద్దె నాలుగైదు వేలు కంటే తక్కువ ఉండదు. అక్కడ బతకడానికి పది వేలు సరిపోవు అని చెప్పి మా అమ్మే నన్ను హైదరాబాద్ వెళ్ళనివ్వలేదు. ఇండియాలో ప్రతివాడికీ ఇంగ్లిష్ మీడియం చదువు అంటే క్రేజ్ ఉంది. మన పట్టణ ప్రాంతాల్లో వీధికి ఒక ఇంగ్లిష్ మీడియం స్కూల్ ఉంది. అక్కడ ఎవరూ నాలుగైదు వేలు కంటే తక్కువ అద్దెకి ఇల్లు ఇవ్వరు. పల్లెటూరిలో 700 రూపాయలకే ఇల్లు అద్దెకి దొరుకుతుంది కానీ గవర్నమెంట్ స్కూల్‌లో చదువు, గవర్నమెంట్ ఆసుపత్రిలో వైద్యం ఎవరికీ ఇష్టం ఉండదు. మనం ప్రత్యామ్నాయానికి ఇష్టపడకపోతే మన వీక్నెస్‌ని బట్టి ఇంటి ఓనర్లు అద్దెలు పెంచరా? నాకు పిల్లలు అవసరం లేదు. నేను పిల్లల్ని కనకపోయినా ఇంటి ఓనర్ తన ప్రాంతంలో ఎంత అద్దెకి ఇల్లు ఇస్తే తనకి ఎక్కువ లాభం వస్తుందో అంత అద్దె అడుగుతాడు. నేను హైదరాబాద్‌లో బతకలేను అనే భయంతోనే మా అమ్మ నన్ను హైదరాబాద్ వెళ్ళనివ్వలేదు. వాళ్ళది ఏ కులమో మాకు తెలియదు. ఇంటర్నెట్ ద్వారా పరిచయమయ్యారు వాళ్ళు. కులం ఇక్కడ సమస్య కాదు. ప్రైవేట్ విద్య, ప్రైవేట్ వైద్యం మీద ఉన్న క్రేజ్ వల్ల ఆ సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లో అయ్యే ఖర్చులే ఇక్కడ సమస్య. 

June 25 2018

praveen2017
05:21
ఫేస్‌బుక్‌లో ముగ్గురు నన్ను బ్లాక్ చేసారు. నన్ను బ్లాక్ చేసినవాళ్ళలో మొదటి వ్యక్తి పెద్దాడ నవీన్. ఆయన బి.జె.పి. అభిమాని & వీర సమైక్యాంధ్రవాది. రాష్ట్ర విభజన వల్ల బి.జె.పి.పై వ్యతిరేకత రాకుండా చూసేందుకు ఆయన ఎంతో పరిశ్రమించేవాడు. అందు కోసం ఆయన నిత్యం కాంగ్రెస్‌ని తిడుతుండేవాడు. బి.జె.పి. వెనుక నుంచి తెలంగాణా బిల్‌కి సపోర్ట్ ఇవ్వడం వల్లే రాష్ట్రం విడిపోయిందనే వాస్తవం వ్రాసినందుకు ఆయన నన్ను బ్లాక్ చేసాడు.

నన్ను బ్లాక్ చేసిన రెండో వ్యక్తి కొండవీటి సత్యవతి. శ్రీరెడ్డికి స్త్రీవాదులు సపోర్ట్ ఇవ్వడాన్ని నేను విమర్శించినందుకు ఆమె నన్ను బ్లాక్ చేసింది. తెలుగు సినిమాలలో హీరోయిన్‌ని నిక్కర్‌తోనూ, హీరోవాళ్ళ అమ్మలక్కలని ఒంటినిండా చీరతోనూ చూపిస్తారు. అవేమీ స్త్రీవాద సినిమాలు కాదు. ఆ సినిమాలలో నటించాలనుకునేవాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వడం స్త్రీవాదుల పని కాదని నేను ఇప్పుడు కూడా నమ్ముతాను.

నన్ను బ్లాక్ చేసిన మూడవ వ్యక్తి రమా సుందరి గారు. ఆవిడ ప్రభుత్వ ఉద్యోగి. ఆవిడ తన పిల్లలని కూడా ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లలో చదివించి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగానికే పంపాలనుకుంటుంది. నేను జనానికి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రాకులాడకుండా ఏ రకం శ్రమ అయినా చేసి బతకొచ్చు అని బోధిస్తుంటాను. నా బోధనలు ఆమెకి నచ్చకపోతే అది ఆమె సమస్య. ఆమె నన్ను బ్లాక్ చేస్తే వచ్చే నష్టం ఏమీ లేదు.
Tags: Controversy

June 22 2018

praveen2017
02:09
కొత్త బండ్లు నడపడం వల్ల రైల్వే ట్రాఫిక్ పెరగదు. బండ్లలో పరిశుభ్రత ఉంటే, సీట్ సులభంగా దొరికే పరిస్థితి ఉంటే ట్రాఫిక్ పెరుగుతుంది. 2013 నుంచి ఇండియాలో రైల్వే పాసింజర్ ట్రాఫిక్ తగ్గిపోతోంది. రైల్వే ప్రయాణాలు మానేస్తున్నవారిలో ఎక్కువ మంది సబ్-అర్బన్ & దగ్గర ప్రాంతాల ప్రయాణికులే. దగ్గర ప్రాంతాలకైతే బస్సులు ఉంటాయి. బస్సులో వేరు శనగ తొక్కలు లాంటివి పడేసి చెత్త చేస్తే కండక్టర్ ఊరుకోడు కనుక బస్సులో పరిశుభ్రత ఎక్కువే ఉంటుంది. ట్రెయిన్‌లలో టాయ్‌లెట్‌లూ, ఎ.సి.లూ లాంటి సౌకర్యాలు ఉండడం వల్ల దూర ప్రాంత ప్రయాణికులు ట్రెయిన్‌లని ఆశ్రయిస్తున్నారు కానీ దగ్గర ప్రాంత ప్రయాణికులు మాత్రం రైల్వే ప్రయాణాలు మానేస్తున్నారు. పార్వతీపురం నుంచి బొబ్బిలి ట్రెయిన్ టికెట్ ధర పది రూపాయలే. ట్రెయిన్ ఎక్కినందుకు హిజ్రాకి మరో పది రూపాయలు ఇచ్చుకోవాలి. హిజ్రాలని నిరోధించినా రైల్వే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది కానీ కేవలం కొత్త బండ్లు నడపడం వల్ల మాత్రం పెరగదు. 
— A rail user
praveen2017
02:07

మార్క్సిజం తెలియని భారతీయ మార్క్సిస్ట్‌లు

చైనాలో మావో బతికి ఉన్న కాలంలో మేనేజర్‌లు లేకుండానే కొన్ని ఫాక్టరీలు నడిచాయి. సొంత ఆస్తి పూర్తిగా రద్దైతే ప్రభుత్వం కూడా అవసరం లేకుండా పోతుంది. ఆర్.నారాయణమూర్తికే కాదు, చాలా మంది సి.పి.ఐ., సి.పి.ఎం. కార్యకర్తలకి కూడా ఈ విషయం తెలియదు. ఒక విద్యార్థి సంఘం (సి.పి.ఐ. అనుబంధ సంస్థో, సి.పి.ఎం. అనుబంధ సంస్థో గుర్తు లేదు) వాళ్ళు విజయనగరం జిల్లాలో పోస్టర్లు అంటించారు. ప్రతి మండలంలోనూ ఒక కాలేజ్ పెట్టాలనీ, ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్యని పెంచాలనీ ఆ పోస్టర్లలో వ్రాసి ఉంది. ఇప్పుడు ఉన్న నిరుద్యోగులే పరిశ్రమల్లో పని చెయ్యడం ఇష్టం లేక ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కావాలంటున్నారు. ఆ సోకాల్డ్ వామపక్ష విద్యార్థి సంఘంవాళ్ళ డిమాండ్లు ఈ రకం నిరుద్యోగులకే మోరల్ సపోర్ట్ ఇచ్చేవిగా ఉన్నాయి. మార్క్సిజం తెలియకుండా వామపక్ష పార్టీ నడిపితే ఆ పార్టీ కార్యకర్తలు చేసే డిమాండ్లైనా, దాని అనుబంధ సంఘ సభ్యులు చేసే డిమాండ్లైనా ఇలాగే ఉంటాయి.
Tags: Ignorance

June 05 2018

praveen2017
12:54

విప్లవ కవితల్ని నిషేధించి, ఎర్ర సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్‌లు ఇవ్వడం వెనుక మతలబు ఇదే

హరి డోర్నాల అనే ఆయన తన బ్లాగ్‌లో అడిగారు "1980ల టైమ్‌లో కమ్యూనిస్ట్, నక్సల్ బ్యాక్‌గ్రౌండ్‌తో తీసిన సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్ దొరకడం కష్టంగా ఉండేది. అప్పట్లో సోవియట్ సమాఖ్యలో ఎర్ర ప్రభుత్వం ఉండేది కనుక ఇక్కడ కూడా విప్లవం వస్తుందనే భయంతో ఎర్ర సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్‌లు అంత తొందరగా ఇచ్చేవాళ్ళు కాదు. 1990లో మాత్రం ఎర్ర సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్‌లు ఎలా ఇచ్చారు?" అని. 

నాకు తెలిసినంత వరకు అవి నిజంగా ఎర్ర సినిమాలు కావు. ఫేస్‌బుక్‌లో రామమోహన్ అనే ఆయన వ్రాసాడు "ఆర్.నారాయణమూర్తికి మార్క్సిజం తెలియదు, నిజంగా మార్క్సిజం తెలిసినవాడు తీసిన సినిమాలకైతే ప్రభుత్వం సెన్సార్ సర్టిఫికేట్‌లు ఇవ్వదు" అని. ఆయన ఆర్.నారాయణమూర్తి ఇంటర్వ్యూ ఒకటి ఏదో పత్రికలో చదివాడు. ఆ ఇంటర్వ్యూలో నారాయణమూర్తి ఏమి చెప్పాడ్ప ఆయన వివరంగా చెప్పలేదు. అసలు నారాయణమూర్తి సినిమాలు ఎలా ఉంటాయో తెలుసుకుందామని నేను "అర్ధరాత్రి స్వతంత్రం" సినిమా చూసాను. ఆ ఒక్క సినిమా చూస్తేనే నారాయణమూర్తికి మార్క్సిజం తెలియదని నాకు కూడా అర్థమైపోయింది. మార్క్సిజం తెలిసినవాడు ఎవడూ మహాత్మా గాంధీని విప్లవకారుడు అనుకోడు. మహాత్మా గాంధీ బహిరంగంగానే కమ్యూనిజమ్‌ని వ్యతిరేకించాడు. సొంత ఆస్తి అనేది ఉంటుందనీ, దానికి పెట్టుబడిదారులే ట్రస్టీలుగా ఉంటారనీ మహాత్మా గాంధీ నమ్మేవాడు. "అర్ధరాత్రి స్వతంత్రం" సినిమాలో నారాయణమూర్తి గాంధేయవాదానికి తన సొంత భాష్యం చెప్పాడు. "సంపద అందరిదీ, దానికి కాపలాదారులు కొందరే అన్న మహాత్మా గాంధీ కూడా విప్లవకారుడే" అనే డైలాగ్ పెట్టాడు నారాయణమూర్తి. విప్లవానికి సంబంధించిన వాస్తవాలని వక్రీకరించి చూపే సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్‌లు ఎందుకు ఇవ్వరు? 

"ఒసేయ్ రాములమ్మ" సినిమాలో ఆ వక్రీకరణలు మరీ ఎక్కువగా ఉంటాయి. ఆ సినిమాలో హీరోయిన్ రేప్‌కి ప్రతీకారం తీర్చుకోవడానికీ, ఇన్సెస్ట్ నుంచి తప్పించుకోవడానికీ నక్సలైట్‌గా మారినట్టు చూపించారు. నిజ జీవితంలో అలాంటివాళ్ళు ఎవరూ ఉండరు, ఎవరైనా ఉన్నా వాళ్ళు కత్తుల సమ్మయ్యలాగ పోలీసులకి లొంగిపోతారు. కరీమ్‌నగర్ జిల్లాలో కత్తుల సమ్మయ్య అనే డెప్యూటీ దళ కమాండర్ ఉండేవాడు. అతనికి శ్రామికవర్గ చైతన్యం ఏమాత్రం లేదు. అతను భూస్వాములతో వ్యక్తిగత గొడవల వల్ల పార్టీలో చేరాడు కానీ తరువాత పోలీసులకి లొంగిపోయాడు. పోలీసులు అతన్ని కోవర్ట్‌గా మార్చి, దళంలోకి తిరిగిపంపించి, అతని చేత ముగ్గురు దళ సభ్యుల్ని కాల్చి చంపించారు. ఆ సినిమాలోని రాములమ్మలాగ ఎవరైనా వ్యక్తిగత అవసరం కోసం దళంలో చేరినా వాళ్ళు కూడా చివరికి కత్తుల సమ్మయ్యలాగ లొంగిపోతారనే లెక్కతో ప్రభుత్వం ఆ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది.

కుబుసం సినిమా వాస్తవానికి కొంచెం దగ్గరగా ఉంటుంది కానీ అది నాన్-కమర్షియల్ సినిమా కావడం, సెన్సార్ బోర్ద్‌వాళ్ళు క్లైమాక్స్ సన్నివేశాన్ని డిలీట్ చెయ్యించడం లాంటి కారణాల వల్ల అది ఫ్లాప్ అయ్యింది. కుబుసం సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ ఇంకో పోలీస్ ఆఫీసర్‌తో అంటాడు "యుద్ధానికి మంచిచెడులతో సంబంధం లేదు. నువ్వు మంచివాడివైనంతమాత్రాన శత్రువు నిన్ను చంపకూడదని రూలేమీ లేదు. నువ్వు నిత్యం అలెర్ట్‌గా ఉండాలి. మనం అలెర్ట్‌గా లేని సమయం కోసమే శత్రువు ఎదురు చూస్తుంటాడు" అని. అలాగే భూస్వామి రేప్ లేదా ఇన్సెస్ట్ చెయ్యకపోయినంత మాత్రాన విప్లవకారులు అతన్ని చంపకూడదని రూల్ ఏమీ లేదు. భూస్వామి దానాలు చేసినంతమాత్రాన విప్లవకారులు అతని భూమిలో జెండాలు పాతకుండా ఉండిపోతారనే రూల్ కూడా లేదు. విప్లవాన్ని కూడా సొంత కాల్పనికత దృష్టితో చూసే దాసరి నారాయణరావుకి ఈ విషయాలు తెలియవు కాబట్టే అతను తీసిన ఒసేయ్ రాములమ్మ, రౌడీ దర్బార్ లాంటి సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్‌లు వచ్చాయి. 

హరి డోర్నాల గారు కేవలం ఒక తెలంగాణావాది. ఆయన మార్క్సిస్ట్ కాదు. "జై బోలో తెలంగాణా" సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో గొడవ జరిగినప్పుడు ఆయన ఆ ప్రశ్న అడిగాడు. "ఆ సినిమాలు చూసి జనం నక్సలైట్లుగా మారుతారనే భయం ప్రభుత్వానికి లేదు, ఒక తెలంగాణావాద సినిమాని మాత్రమే ఎందుకు నిషేధించాలనుకుంటున్నారు?" అని కూడా ఆయన ప్రశ్నించాడు.

June 04 2018

praveen2017
01:38

పెట్రోల్ ధరలు పెంచి, ఆ డబ్బుతోనే ఉపాధి హామీ పథకం పెట్టి!

ఓ 20 సెంట్ల భూమిలో ప్రొక్లెయినర్‌తో చెరువు తవ్వడానికి కొన్ని గంటలు పడుతుంది. అదే పని మనుషులతో చెయ్యిస్తే వారం రోజులు పడుతుంది. అయితే ఏడెనిమిది గంటల కోసం ప్రొక్లెయినర్ యజమాని రాడు. ఇరవైముప్పై గంటలు పనుంటేనే అతను వస్తాడు. అతనికి డీజిల్ ఖర్చు కలిసి రావాలంటే అతను ఎక్కువ సమయం దొరికే పనే ఒప్పుకోవాలి. 

ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద రోడ్లు వేస్తోంది. ప్రొక్లెయినర్‌తో ఒక మెరక మీద రోడ్ తవ్వడానికి రెండు మూడు రోజులు పడుతుంది. అదే పని మనుషులతో చెయ్యిస్తే ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఆ రోడ్ వేసిన కాంట్రాక్టర్‌కి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. అందుకే ఉపాధి హామీ కాంట్రాక్టర్‌లు కూడా మెషీన్‌లతోనే పనులు చెయ్యిస్తారు. ఫినిషింగ్ పనులు చేసే మెషీన్‌లు కూడా ఉన్నాయి కానీ ఆ కాంట్రాక్టర్ మనుషులతో పనులు చెయ్యించాడనడానికి ఎవిడెన్స్ ఉండాలి కనుక అతను ఫినిషింగ్ పనులు మాత్రం మనుషులతో వెయ్యించి ఫొటోలు తీస్తాడు. 

పేవింగ్(కంకర పొయ్యడం)కి కూడా మెషీన్‌లు ఉన్నాయి కానీ అందుకు మనుషుల్ని వాడే కాంట్రాక్టర్‌లు ఉన్నారు. కూలీలు ఎక్కువగా రోడ్ నిర్మాణానికి వెళ్ళిపోవడం వల్ల వ్యవసాయ పనులకి కూలీలు దొరకడం లేదు. కొన్ని ప్రాంతాల్లో 500 రూపాయలు ఇచ్చినా కూలీలు దొరకడం లేదు. ఉపాధి హామీ పథకం ఏమీ చవకైనది కాదు కానీ పెట్రోల్ ధరలు పెంచడం, జి.ఎస్.టి. పేరుతో పన్నులు బాదడం లాంటి వాటి ద్వారా వచ్చిన డబ్బుతో ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తోంది. 
Tags: Economy

June 03 2018

praveen2017
08:09

June 02 2018

praveen2017
12:13

రూపాయి బియ్యం వల్ల ప్రపంచ బ్యాంక్ అప్పు తప్ప మిగిలేది ఏమీ లేదు

చవక రకం ధాన్యం ధర 100 కెజిలకి 1000 రూపాయలు. అనగా కెజి పది రూపాయలు. మూడు కెజిల ధాన్యాన్ని మిల్లులో ఆడిస్తే రెండు కెజిల బియ్యం వస్తుంది. రైస్ మిల్లర్ మిల్లింగ్ చార్జిలు వసూలు చెయ్యకుండా ఊకని అమ్ముకుని సంపాదించినా చవక రకం బియ్యం ధర కెజి 15 రూపాయలు ఉండాలి. మరి కెజి రూపాయికి బియ్యం అమ్మడం ఎలా సాధ్యమయ్యింది? అది ప్రపంచ బ్యాంక్ అప్పులతోనే కదా! 

ఫ్రీ స్కీముల వల్ల పేదరికం తగ్గిన దాఖలాలు ఏమాత్రం లేవు. నాకు తెలిసిన కొంత మంది రైతులు తమ పొలంలో పండిన ధాన్యాన్ని రైస్ మిల్లులో ఆడించుకుని తింటారు తప్ప కెజి ధాన్యానికి పది రూపాయలు వస్తే దానితో పది కెజిల బియ్యం కొనుక్కోవడం జరగదు. ఫ్రీ స్కీముల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది తప్ప వస్తు ఉత్పత్తి పెరగదు. 

నేను ఆర్.జి.ఎల్. ధాన్యాన్ని రైస్ మిల్లులో ఆడించాను. దానికి నాకు మూడు కెజిల ధాన్యానికి ఒక కెజి బియ్యమే వచ్చింది. ఆర్.జి.ఎల్. ధాన్యం ధర క్వింటాల్ 1,550 రూపాయలు. అనగా కెజి 15 రూపాయల 50 పైసలు. మూడు కెజిల ఆర్.జి.ఎల్. ధాన్యం ధర 46 రూపాయల యాభై పైసలు ఉంటుంది. రైస్ మిల్లర్ నా దగ్గర మిల్లింగ్ చార్జిలు వసూలు చెయ్యలేదు కానీ ఊక అమ్ముకుని మాత్రం పైసలు బాగానే గడించాడు. 

May 22 2018

praveen2017
09:53
హజార్ చౌరాసీకీ మా పుస్తకం నేను చదవలేదు. అది నాకు దగ్గరలోని లైబ్రరీలో దొరికితే చదవగలను. విప్లవకారులు దొరికితే వాళ్ళని జైల్‌లలో చిత్రహింసలు పెట్టించి బూటకపు ఎంకౌంటర్‌లలో చంపించే ప్రభుత్వం దగ్గర అవార్డ్ తీసుకున్న రచయిత్రి నిజ జీవితంలో ఒక చనిపోయిన విప్లవకారుని కన్న తల్లి అయినా కూడా ఆమెని విమర్శించాల్సిందే.
— ఒక తెలుగువాడు
praveen2017
05:53
విప్లవ పార్టీల్లో యాక్టివ్‌గా పని చేస్తున్నవాళ్ళకైతే వర్గ స్వభావం తెలుసు కానీ లొంగిపోయినవాళ్ళకి మాత్రం వర్గ స్వభావం ఏమాత్రం తెలియదు. కొంత మంది లొంగిపోయినవాళ్ళ ప్రకటనలు ఆన్లైన్‌లో చదివాను. "బుల్లెట్ వల్ల సమస్యలు పరిష్కారం కావు, బ్యాలెట్ వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి" అని కొంత మంది లొంగిపోయినవాళ్ళు అంటున్నారు. శ్రామిక వర్గ విప్లవం అనేది కాంగ్రెస్, తెలుగు దేశం లాంటి పార్టీల అజెండాలో లేనే లేదు. వాళ్ళు కాంగ్రెస్‌కో, తెలుగు దేశానికో వోట్ వెయ్యడానికి లొంగిపోయారంటే నమ్మాలా?
— ఒక తెలుగువాడు
praveen2017
05:44

తీవ్రవాదులని పట్టుకోవడానికి ఇంత కంటే మంచి మార్గం దొరకలేదా?

కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల్లో లొంగిపోయిన తీవ్రవాదులకి నాలుగు లక్షలు రివార్డ్ ఇస్తుందట! ఆరు వేలు పెన్షన్ కూడా ఇస్తుందట! లక్ష రూపాయలు వెంటనే ఇచ్చి మిగితాది తరువాత ఇస్తుందట! ఈశాన్య రాష్ట్రాలో పరిశ్రమలు పెట్టి స్థానికులకి ఉద్యోగాలు ఇస్తే అక్కడి జనం తీవ్రవాదుల్లో చేరరు కదా, మరి తీవ్రవాదుల్ని అణచివెయ్యడానికి అంత మొత్తం రివాడ్‌లు ఎందుకు? ఆంధ్ర ప్రదేశ్‌లో లొంగిపోయిన మావోయిస్ట్‌లకి ఇచ్చే రివార్డ్ 35,000 మాత్రమే. మొదట ఇచ్చేది 5,000. మిగితాది తరువాత ఇస్తారు. ఇన్‌ఫార్మర్‌గా మారి తమకి గుర్తున్న ముఖాలని పట్టివ్వకపోతే అది కూడా ఇవ్వరు.

అవిభక్త ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రం లొంగుబాట్ల విధానం సక్సెస్ అయ్యింది. ఇన్‌ఫార్మర్‌లుగా మారినవాళ్ళకి మాత్రమే రివార్డులు ఇస్తారని చాలా మందికి తెలియదు. నయీం, కత్తుల సమ్మయ్య, జడల నాగరాజు, బయ్యపు సమ్మిరెడ్డి లాంటివాళ్ళ విలాసవంతమైన జీవితం చూసి, దాని కోసం చాలా మంది లొంగిపోయారు. ఈశాన్య రాష్ట్రాలలోని లొంగుబాట్ల విధానం మాత్రం ఫెయిల్ అవుతుందనే ఖచ్చితంగా చెప్పగలను. లొంగిపోయిన వ్యక్తిని స్టేషన్ హౌస్ ఆఫీసరే స్క్రీనింగ్ చేస్తాడు. అతను తీవ్రవాది కాదు, రివార్డ్ కోసం తాను తీవ్రవాదినని చెప్పుకుని లొంగిపోయాడు అని స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కి తెలిసిందనుకుందాం. స్టేషన్ హౌస్ ఆఫీసర్ అతనితో డబ్బులు పంచుకోవడానికి అతన్ని లొంగిపోయిన తీవ్రవాదిగానే చూపించగలడు. చత్తీస్‌గడ్‌లో లొంగిపోయిన తీవ్రవాదులకి ఇచ్చే గ్రాంట్ పదివేలు మాత్రమే కానీ ఆ పదివేలు గ్రాంట్ కోసం కూడా నకిలీ లొంగుబాట్లు జరుగుతున్నాయి.
Tags: State
praveen2017
05:25

పోలీసుల చేత కూడా పని చెయ్యించలేని చేతకాని ప్రభుత్వం!

కుబుసం సినిమా మళ్ళీ చూసాను. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ సరిగా పని చెయ్యరు అని ఆ సినిమా రచయితకి తెలుసు కానీ అందుకు కారణాలు ఆయనకి సరిగా తెలియదు. మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకి జీతం చాలా ఎక్కువ కానీ ప్రభుత్వ ఉద్యోగం రావడానికి ఇంగ్లిష్ తప్పనిసరి. ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు తన పిల్లల్ని ప్రభుత్వ ఉద్యోగానికే పంపించాలనుకుంటాడు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పట్టణాల్లో ఇళ్ళు అద్దెలకి తీసుకుని తమ పిల్లల్ని ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో చదివిస్తూ, గ్రామాలకి మాత్రం వారానికి ఒకసారి వచ్చి పోతుంటారు. నిజ జీవితంలో అలా పని చేసే ఒక రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌నీ, ఒక అమీన్‌నీ ఒరిస్సా రాష్ట్రంలో చూసాను. అంగన్‌వాడీ వర్కర్‌లకి జీతాలు మరీ ఎక్కువ ఇచ్చి, దానికి కూడా ఇంగ్లిష్ మీడియమ్‌ని మాండేట్ చేసినా, అంగన్వాడీ వర్కర్లు కూడా గ్రామాల్లో పని చెయ్యకుండా తమ పిల్లల్ని పట్టణాల్లోని ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లలో చదివించుకుంటూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగుల పని తీరు గురించి ఇంత క్లియర్‌గా చెప్పలేకపోయాడు ఆ సినిమా రచయిత. 

పోలీసుల తెలివితేటలు మాత్రం ఆ రచియతకి బాగా తెలుసు. ఆ సినిమాలో వీక్ ఎలిమెంట్ అయిన ఒక విప్లవకారుడు పోలీసులకి లొంగిపోతానంటాడు. "నువ్వు లొంగిపోతే మాకేంటి లాభం? నువ్వు దళ కమాండర్‌వి కూడా కాదు" అని పోలీస్ ఆఫీసర్ అంటాడు. దళ కమాండర్‌కైతే వేరే దళాలలో పని చేసేవాళ్ళ ముఖాలు కూడా తెలుస్తాయి. దళ కమాండర్ లొంగిపోతే అతను ఇన్‌ఫార్మర్‌గా పనికొస్తాడు. నిజ జీవితంలో పోలీసులు నయీంని అలాగే ఇన్‌ఫార్మర్‌గా వాడుకున్నారు కదా. నిజ జీవితంలో దళ డెప్యూటీ కమాండర్‌గా పని చేసి లొంగిపోయిన కత్తుల సమ్మయ్యకి కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. సోమ్లా నాయక్‌కి మాత్రం పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు. అతన్ని వాడుకుని వదిలేసారు. అతను చివరికి దొంగతనాలు చేసుకుంటూ బతికాడు. అతను ఓ గ్రామంలో దొంగతనం చేస్తుండగా జనం అతన్ని కొట్టి చంపారు. 

పోలీసులు లేకపోతే దొంగతనాలూ, రేప్‌లూ పెరిగిపోతాయి కానీ మన దేశంలో కొన్ని చోట్ల పోలీసులు కూడా సరిగా పని చెయ్యరు. ఒరిస్సాలోని శేషికల్ పోలీస్ స్టేషన్ ఉద్యోగుల్లో ఇన్స్పెక్టర్-ఇన్-చార్జ్ తప్ప ఎవరూ శేషికల్ గ్రామంలో ఉండరు. వాళ్ళందరూ రాయగడ పట్టణంలో ఇళ్ళు అద్దెలకి తీసుకుని తమ పిల్లల్ని ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లలో చఫివిస్తుంటారు. ఒక పోలీస్ స్టేషన్‌లో ఇద్దరుముగ్గురు ఇన్స్పెక్టర్లు ఉన్నప్పుడు వాళ్ళలో ఒకరిని ఇన్స్పెక్టర్-ఇన్-చార్జ్‌గా నియమిస్తారు. నేరస్తుణ్ణి అరెస్ట్ చేసినప్పుడు ఇన్స్పెక్టర్-ఇన్-చార్జే అతన్ని కోర్ట్‌లో హాజరుపరుస్తాడు. సి.ఆర్.పి.సి. చాప్టర్ 8 కేసుల నోటీసుల్ని కూడా ఇన్స్పెక్టర్-ఇన్-చార్జ్ ద్వారానే అందిస్తారు. అందువల్ల స్టేషన్ ఇన్-చార్జ్ తప్పకుండా స్టేషన్ ఉన్న గ్రామంలోనే నివాసం ఉంటాడు. సబ్-ఇన్స్పెక్టర్లూ, కానిస్టేబుళ్ళు మాత్రం స్టేషన్ ఉన్న గ్రామంలో నివాసముండరు. 

పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా పని చేస్తే మావోయిస్టులు కూడా పెరిగిపోరా అనే అనుమానం వస్తుంది. ఒరిస్సాలో మావోయిస్టుల్ని సి.ఆర్.పి.ఎఫ్.వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళు దొరికిన మావోయిస్టుల్ని పోలీస్ స్టేషన్ ఇన్-చార్జ్‌కి అప్పగిస్తారు. స్టేషన్ ఇన్-చార్జ్ వాళ్ళని సెల్‌లో చిత్ర హింసలు పెట్టి వాళ్ళ సహచరుల అడ్రెస్‌లు చెప్పమంటాడు. సి.ఆర్.పి.ఎఫ్.వాళ్ళు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న బారక్స్‌లోనే ఉంటారు. కనుక మావోయిస్టులనైతే పట్టుకోవడం ఒరిస్సా పోలీసులకి కష్టం కాదు. పోలీసులు జనానికి దూరంగా ఉండడం వల్ల దొంగతనాలు, రేప్‌లు, సి.ఆర్.పి.సి.107, 110 లాంటి కేసులు మాత్రం పెరుగుతాయి.  
Tags: State
praveen2017
05:18

బానిసత్వాన్ని ఇష్టపడేవాళ్ళని ఎవరు బాగుచెయ్యగలరు?

స్త్రీపురుష సమానత్వం రావడం చాలా మంది స్త్రీలకే ఇష్టం లేదు, అలాంటప్పుడు పురుషులు మాత్రం అందుకు ఒప్పుకుంటారా? మా అమ్మ విశాఖపట్నం బుల్లయ్య కాలేజ్ ఆంధ్రా బ్యాంక్‌లో పని చేసేటప్పుడు ఆవిడ జీతం యాభైనాలుగు వేలు. బుల్లయ్య కాలేజ్‌కి దగ్గరలో ఇంటి అద్దె పదిహేను వేలు కావడంతో మేము నక్కవానిపాలెంలో తొమ్మిదివేలకి ఇల్లు అద్దెకి తీసుకున్నాం. ఇంటి దగ్గరే హాస్పిటల్ ఉండడం వల్ల కూడా అక్కడ తీసుకున్నాం. ఆ ఇంటి వెనుక వీధిలో కొంద మంది బిల్డింగ్ కార్మికులు ఉన్నారు. ఆ లేబర్ ఏరియాలో ఇల్లు ఎందుకు అద్దెకి తీసుకున్నారు అని మా పెద్దమ్మ కూతురు నన్ను అడిగింది. సంపాదించేవాళ్ళకే డబ్బు విలువ తెలుస్తుంది కానీ మొగుడు సంపాదించింది ఫ్రీగా తినేవాళ్ళకి అది తెలుస్తుందా అని నేను అడిగాను. తాను ఆడపిల్లననీ, మొగుడు సంపాదించింది ఫ్రీగా తినే హక్కు తనకి ఉందనీ చెప్పుకుంది. ఆడవాళ్ళే తాము ఉద్యోగాలు చెయ్యకుండా మగవాళ్ళ మీద ఆధారపడి బతకాలని కోరుకుంటున్నప్పుడు మగవాళ్ళు వాళ్ళని ఏమి ఉద్ధరించగలరు?
Tags: Women

April 06 2018

praveen2017
14:40
6138 dba6 500
ఎందుకూ పనికి రాకుండా పోవడానికి ఈ చదువులు అవసరమా?

March 27 2018

praveen2017
06:32

భాజపా పాలనలో పెరిగిన ఆవు మాంసం ఎగుమతి

ఆవుని రక్షించడానికి మనిషిని చంపడాన్ని ఎవరూ అహింసావాదం అనరు కానీ గోరక్షణ పేరుతో దళితులూ, ముస్లింలపై దాడులు చెయ్యించే భాజపా పాలనలో ఆవు మాంసం ఎగుమతి పెరిగింది. ఆవు కొవ్వు ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని భాజపా ప్రభుత్వమే రద్దు చేసింది. ఆవు మాంసం ప్రాసెసింగ్ చేసే కంపెనీలని ఏమీ చెయ్యకుండా దళితుల్నీ, ముస్లింలనీ మాత్రమే గోరక్షణ పేరుతో చంపితే ఆవు మాంసం వ్యాపారం ఎలా తగ్గుతుంది? 

మన దేశంలో ఉన్నది human intensive production, పాశ్చాత్య దేశాల్లో ఉన్నది machine intensive production. పది మంది చేసే పని ఒక మెషీన్ చెయ్యగలదు. అమెరికా, జపాన్‌లలో మెషీన్‌లతోనే వ్యవసాయం చేస్తారు. కూలీల చేత వ్యవసాయం చెయ్యిస్తే కూలీవాళ్ళు బతకడానికి అయ్యే ఖర్చు మనమే భరించాలి. ఇద్దరు మనుషుల మధ్య ఉన్నది వస్తు మార్పిడి సంబంధమే అంటాడు మార్క్స్. శ్రమని కొనేవాడికీ, శ్రమని అమ్ముకునేవాడికీ మధ్య ఉన్నది కూడా ఆ సంబంధమే. ఒకరి హక్కుల్ని ఇంకొకరు పరస్పరం గుర్తించాలి అంటాడు మార్క్స్. కూలీవాడు ఒక రోజు బతకడానికి ఎంత ఖర్చవుతుందో, ఆ రోజు అతని శ్రమని కొనేవాడే భరించాలి. కూలీవాళ్ళని పోషించడానికి అయ్యే ఖర్చు కంటే మెషీన్‌ని మెయింటెయిన్ చెయ్యడానికి అయ్యే ఖర్చు తక్కువ అనిపిస్తే మనం మెషీన్ వైపే మొగ్గు చూపుతాం. జనాభా పెరిగితే చీప్ లేబర్ దొరుకుతుందని నమ్మేవాళ్ళలో కొంత మంది ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు కానీ వాళ్ళ అభిప్రాయం తప్పు. జనాభా ఎంత ఉన్నా కూలీవాడు బతకడానికి అయ్యే ఖర్చు అతని శ్రమని కొనేవాడు భరించాల్సిందే. 

జనాభా పెరిగితే నిరుద్యోగం పెరిగుతుందనీ, నిరుద్యోగం పెరిగితే చీప్ లేబర్ దొరుకుతారనీ ఒకప్పుడు నేను కూడా నమ్మేవాణ్ణి. నిరుద్యోగం ఎంత పెరిగినా శ్రామికుడు బతకడానికి అయ్యే ఖర్చుని అతని శ్రమని కొనేవాడే భరించాలి. 

పల్లెటూర్లలో ఇల్లు 700 రూపాయలకే అద్దెకి దొరుకుతుంది. పట్టణంలో అయితే అది 5,000 రూపాయల కంటే తక్కువ ధరకి దొరకదు. ఇంగ్లిష్ మీడియం స్కూల్‌కి దగ్గరలో అయితే అది 15,000 రూపాయలు కూడా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగి జీతానికీ, పారిశ్రామిక ఉద్యోగి జీతానికీ మధ్య పెద్ద తేడా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం కోసం అంత ఖర్చు పెట్టి ఎవరూ ఇంగ్లిష్ మీడియం చదువులు చదవరు.

ఇప్పుడు కూడా పశువులు కాసేవాళ్ళలో సగం మందికి చదువు రాదు. వాళ్ళు ప్రకృతి గురించి తమకి తెలిసిన జ్ఞానంతోనే పశువులు పెంచుతారు. వాళ్ళెవరూ B.Sc. (Biology) చదివి పశువులు పెంచాలనుకోరు. అయినప్పటికీ పశువులు పెంచడానికి average labour time ఎక్కువే పడుతుంది. కిలో కోడి మాంసం ఉత్పత్తికి 3 కెజిల దాణా అవసరం అయితే కిలో మేక మాంసం ఉత్పత్తికి 7 కెజిల దాణా అవసరం. కోళ్ళ ఫార్మ్‌లలో ఈగల్ని చంపడానికి ఖరీదైన మందులు కూడా వాడుతారు. మాంసం ఉత్పత్తి చెయ్యడానికి average labour time ఎక్కువ పడుతుంది కాబట్టే మాంసం ధర ఎక్కువ. ఆ ధర సమస్య వల్లే జనం ఎక్కువగా శాకాహారం తింటారు. అంతే కానీ శాకాహారం పాపులర్ అవ్వడానికి కారణం అహింసావాదం కాదు.

January 05 2018

praveen2017
12:20

The counterproductivity of education

లిల్లీ: నీకేమీ పని లేదా? ఎప్పుడూ ఆ అమ్మాయికే లైన్ వేస్తూ ఉంటావ్?
బాబీ: తప్పేమిటి? ఆ అమ్మాయి హిందూ సంప్రదాయం ప్రకారం నాకు మరదలు అవుతుంది.
లిల్లీ: ఇంకేదో మత సంప్రదాయం ప్రకారం ఆమె నీకు ఇంకేదో వరస కావచ్చు, కానీ నువ్వు ఆమెని పెళ్ళి చేసుకోవాలంటే ఆమె అంగీకారం ముఖ్యం. దీనికి వరసలు కలవడం ఒక్కటే అర్హత కాదనుకుంటాను!
బాబీ: What do you mean?
లిల్లీ: వరసలు అనేవి ఒక్కో మతంలో ఒక్కోలాగ ఉంటాయి. ఆ polemics నీకు అర్థం అయితే పర్వా లేదు. పెళ్ళికి వరసలు కలవడం ఒక్కటే అర్హత కాదని మాత్రం నేను గట్టిగా చెప్పగలను.
బాబీ: నేను గవర్నమెంట్ ఉద్యోగిని, నా జీతం నలభై వేలు. నేను పని సరిగా చెయ్యకపోయినా నా ఉద్యోగం పోదు. నా సంపాదన చూసి ఏ అమ్మాయైనా నా లైన్‌లో పడదా? 
లిల్లీ: నీ దృష్టిలో పెళ్ళి అనేది ఆర్థిక సంబంధమే తప్ప మానసిక సంబంధం కాదా?
బాబీ: ఇందులో తప్పేమిటి? ఆడదాని అందాన్నీ, మగవాడి ఉద్యోగాన్నీ చూసి పెళ్ళి చేస్తారు.
లిల్లీ: నేను డాక్టర్‌ని, నా భర్త నిరుద్యోగి. అయినా మేము ఎలా పెళ్ళి చేసుకున్నాం?
బాబీ: ఏమో? నువ్వు చదువుకున్న నిరుద్యోగిని పెళ్ళి చేసుకుని ఉంటావ్. Industrial labourగా పని చెయ్యడానికి సిద్ధంగా ఉన్న నిరుద్యోగినైతే నువ్వు పెళ్ళి చేసుకునేదానివా? 
లిల్లీ: నీ అభిప్రాయం ప్రకారం చదువు అనేది గవర్నమెంట్ ఉద్యోగం కోసమేనన్నమాట! Industrial workerకి చదువు అవసరం లేదంటావ్. మన దేశంలో చదువుకున్నవాళ్ళలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ప్రాకులాడుతున్నారు తప్ప పరిశ్రమల్లో పని చెయ్యడానికి ఒప్పుకోవడం లేదని నీ మాటల్లోనే తెలిసిపోతోంది. ఈ పోకడ సమాజానికి counter-productive తప్ప productive ఏమాత్రం కాదు. 

November 25 2017

praveen2017
00:46

తరతరాల నిజాం బూజుని నమ్ముకునేది బాగుపడడానికా?

పూర్వం రాజులూ, జమీందార్లూ భోగం కులానికి చెందిన స్త్రీలని ఉంపుడుగత్తెలుగా ఉంచుకునేవాళ్ళు. వాళ్ళ రాజధానుల్లో వేశ్యావృత్తి ప్రబలంగానే ఉండేది. పెద్దాపురం, వేల్పూరులు ఒకప్పటి జమీందారీ సంస్థాన కేంద్రాలు కావడం వల్ల అక్కడ ఇప్పుడు కూడా వేశ్యావృత్తి కొనసాగుతోంది. వేశ్యా వాటికల్ని నిర్మూలించాలనేవాడు పెద్దాపురం రాజావారిని గొప్ప స్త్రీవాది అంటూ పొగిడితే ఎలా ఉంటుంది? తెలంగాణావాది నిజాం బూజుని పొగిడినా అలాగే ఉంటుంది!     

బ్రిటిష్ పరిపాలనలో మన దేశంలో అక్షరాస్యత 12% మాత్రమే ఉండేది. అప్పట్లో మన దేశంలో అక్షరాస్యత అత్యధికంగా ఉన్న సంస్థానం బరోడా. బరోడా సంస్థానంలో 33% అక్షరాస్యత ఉండేది. అప్పట్లో అత్యల్ప అక్షరాస్యత గల సంస్థానం హైదరాబాద్. హైదరాబాద్ సంస్థానంలో అక్షరాస్యత 4.8% మాత్రమే ఉండేది. జనం తమ నిజ జీవితంలో ఉపయోగించని ఉర్దూ భాషని మాధ్యమంగా పెట్టి చదువు నేర్పించడం వల్ల అలా జరిగింది అనుకుందామా? హైదరాబాద్ రాష్ట్ర వెనుకబాటుకి కారణాలలో ఉర్దూ మీడియం ఒకటి మాత్రమే. ఆర్థికంగా కూడా హైదరాబాద్ రాష్ట్రం బాగుపడిందేమీ లేదు. హైదరాబాద్ రాష్ట్రంలోని భూమిలో 10% నిజాం సొంత ఎస్టేట్, 30% భూమి జాగీర్దార్‌ల ఎస్టేట్‌లు, మిగితా 60% ప్రభుత్వ భూమి. సొంత ఆస్తి వ్యవస్థ ఇంత బలంగా ఉన్నప్పుడు ఆర్థిక అసమానతలు కూడా ఎక్కువే ఉంటాయి. ఎక్కడైనా ఆర్థికంగా ముందున్నవాళ్ళే చదువుపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు తప్ప ఆర్థికంగా వెనుకబడినవాళ్ళకి చదువు మీద అంత ఆసక్తి ఉండదు. 

నిజాం బూజు వల్లే తెలంగాణా వెనుకబడిందని ఒప్పుకోవడం MIMకి ఇష్టం లేదు. తెలంగాణా వెనుకబడలేదు అనే ఇంప్రెషన్ కలిగించడానికి MIM తెలంగాణా ఏర్పాటుని వ్యతిరేకించింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. తెలంగాణా ఏర్పడితే ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయి అని ప్రచారం చేసిన రాజశేఖర రెడ్డికి కూడా ఈ విషయం తెలిసి ఉండదు. రాజశేఖరరెడ్డి ముస్లింల వోట్ల కోసం బహిరంగంగానే నిజామ్‌ని పొగిడాడు. సిపాయిల తిరుగుబాటు సమయంలో నిజాం ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన తురేహ్‌బాజ్ ఖాన్, మౌల్వీ అలాఉద్దీన్, ముబారిజుద్దౌలా తదితరులు ముస్లింలేనని రాజశేఖరరెడ్డికి తెలిసి ఉండదు. ఇప్పుడు నిజాం భజన కీర్తనలు పాడుతున్న కె.సి.ఆర్. బృందానికి కూడా ఈ చరిత్ర తెలిసి ఉండదు. రేప్‌కి గురైన స్త్రీని ఆమెని రేప్ చేసినవాడికే ఇచ్చి పెళ్ళి చెయ్యడం ఎలాంటిదో, తెలంగాణా వెనుకబాటుకి కారణమైన నిజాం బూజుని తెలంగాణాకి వారసత్వంగా అందించడం అలాంటిది. 

November 24 2017

praveen2017
01:40

ఆత్మకి బట్టలెందుకు?

మనిషికైతే ఎండ నుంచి, వాన నుంచి, చలి నుంచి, ధూళి నుంచి రక్షణ కోసం బట్టలు అవసరం. మరి సినిమాలలో ఆత్మలు కూడా బట్టలు వేసుకుంటున్నట్టు చూపిస్తున్నారంటే దాని అర్థం ఆత్మలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదనే కదా!  ఉదయం నాకు కలలో ఆత్మ కనిపించింది. అది కల అని నాకు వెంటనే అర్థమైపోయింది. ఎందుకంటే ఆత్మ అనేది అనుభూతి పొందలేనిది, అలాంటిది ఎక్కడా ఉండదు. మెలుకువ వచ్చిన తరువాత కొద్దిగా ఆలోచించాను "ఆత్మ అనేది ఎండకి ఎండదు & వానకి తడవదు, దానికి బట్టలు అనవసరం కదా, మరి నాకు కలలో కనిపించిన ఆత్మకి బట్టలు ఉన్నాయేమిటి?" అని. ఇప్పుడు ఇంకో అనుమానం వచ్చింది "మనిషికి ఆత్మ ఉంటుందని నమ్ముతారు, అది కనిపించదని కూడా నమ్ముతారు, కానీ వస్త్రానికి ఆత్మ ఉంటుందా? ఆత్మ దానికి మాత్రమే కనిపించే వస్త్రం వేసుకుంటుందా?" అని. ఇలాంటి సందేహాలు చాలా వస్తాయి. మనిషి చనిపోయిన తరువాత అతని ఆత్మ శరీరం నుంచి వస్త్రం లేకుండా వేరుపడుతుందా లేదా వస్త్రంతో సహా వేరుపడుతుందా? 

Tags: Superstition
Older posts are this way If this message doesn't go away, click anywhere on the page to continue loading posts.
Could not load more posts
Maybe Soup is currently being updated? I'll try again automatically in a few seconds...
Just a second, loading more posts...
You've reached the end.

Don't be the product, buy the product!

Schweinderl