Newer posts are loading.
You are at the newest post.
Click here to check if anything new just came in.
praveen2017
05:44

తీవ్రవాదులని పట్టుకోవడానికి ఇంత కంటే మంచి మార్గం దొరకలేదా?

కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల్లో లొంగిపోయిన తీవ్రవాదులకి నాలుగు లక్షలు రివార్డ్ ఇస్తుందట! ఆరు వేలు పెన్షన్ కూడా ఇస్తుందట! లక్ష రూపాయలు వెంటనే ఇచ్చి మిగితాది తరువాత ఇస్తుందట! ఈశాన్య రాష్ట్రాలో పరిశ్రమలు పెట్టి స్థానికులకి ఉద్యోగాలు ఇస్తే అక్కడి జనం తీవ్రవాదుల్లో చేరరు కదా, మరి తీవ్రవాదుల్ని అణచివెయ్యడానికి అంత మొత్తం రివాడ్‌లు ఎందుకు? ఆంధ్ర ప్రదేశ్‌లో లొంగిపోయిన మావోయిస్ట్‌లకి ఇచ్చే రివార్డ్ 35,000 మాత్రమే. మొదట ఇచ్చేది 5,000. మిగితాది తరువాత ఇస్తారు. ఇన్‌ఫార్మర్‌గా మారి తమకి గుర్తున్న ముఖాలని పట్టివ్వకపోతే అది కూడా ఇవ్వరు.

అవిభక్త ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రం లొంగుబాట్ల విధానం సక్సెస్ అయ్యింది. ఇన్‌ఫార్మర్‌లుగా మారినవాళ్ళకి మాత్రమే రివార్డులు ఇస్తారని చాలా మందికి తెలియదు. నయీం, కత్తుల సమ్మయ్య, జడల నాగరాజు, బయ్యపు సమ్మిరెడ్డి లాంటివాళ్ళ విలాసవంతమైన జీవితం చూసి, దాని కోసం చాలా మంది లొంగిపోయారు. ఈశాన్య రాష్ట్రాలలోని లొంగుబాట్ల విధానం మాత్రం ఫెయిల్ అవుతుందనే ఖచ్చితంగా చెప్పగలను. లొంగిపోయిన వ్యక్తిని స్టేషన్ హౌస్ ఆఫీసరే స్క్రీనింగ్ చేస్తాడు. అతను తీవ్రవాది కాదు, రివార్డ్ కోసం తాను తీవ్రవాదినని చెప్పుకుని లొంగిపోయాడు అని స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కి తెలిసిందనుకుందాం. స్టేషన్ హౌస్ ఆఫీసర్ అతనితో డబ్బులు పంచుకోవడానికి అతన్ని లొంగిపోయిన తీవ్రవాదిగానే చూపించగలడు. చత్తీస్‌గడ్‌లో లొంగిపోయిన తీవ్రవాదులకి ఇచ్చే గ్రాంట్ పదివేలు మాత్రమే కానీ ఆ పదివేలు గ్రాంట్ కోసం కూడా నకిలీ లొంగుబాట్లు జరుగుతున్నాయి.
Tags: State

Don't be the product, buy the product!

Schweinderl