Newer posts are loading.
You are at the newest post.
Click here to check if anything new just came in.
praveen2017
01:38

పెట్రోల్ ధరలు పెంచి, ఆ డబ్బుతోనే ఉపాధి హామీ పథకం పెట్టి!

ఓ 20 సెంట్ల భూమిలో ప్రొక్లెయినర్‌తో చెరువు తవ్వడానికి కొన్ని గంటలు పడుతుంది. అదే పని మనుషులతో చెయ్యిస్తే వారం రోజులు పడుతుంది. అయితే ఏడెనిమిది గంటల కోసం ప్రొక్లెయినర్ యజమాని రాడు. ఇరవైముప్పై గంటలు పనుంటేనే అతను వస్తాడు. అతనికి డీజిల్ ఖర్చు కలిసి రావాలంటే అతను ఎక్కువ సమయం దొరికే పనే ఒప్పుకోవాలి. 

ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద రోడ్లు వేస్తోంది. ప్రొక్లెయినర్‌తో ఒక మెరక మీద రోడ్ తవ్వడానికి రెండు మూడు రోజులు పడుతుంది. అదే పని మనుషులతో చెయ్యిస్తే ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఆ రోడ్ వేసిన కాంట్రాక్టర్‌కి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. అందుకే ఉపాధి హామీ కాంట్రాక్టర్‌లు కూడా మెషీన్‌లతోనే పనులు చెయ్యిస్తారు. ఫినిషింగ్ పనులు చేసే మెషీన్‌లు కూడా ఉన్నాయి కానీ ఆ కాంట్రాక్టర్ మనుషులతో పనులు చెయ్యించాడనడానికి ఎవిడెన్స్ ఉండాలి కనుక అతను ఫినిషింగ్ పనులు మాత్రం మనుషులతో వెయ్యించి ఫొటోలు తీస్తాడు. 

పేవింగ్(కంకర పొయ్యడం)కి కూడా మెషీన్‌లు ఉన్నాయి కానీ అందుకు మనుషుల్ని వాడే కాంట్రాక్టర్‌లు ఉన్నారు. కూలీలు ఎక్కువగా రోడ్ నిర్మాణానికి వెళ్ళిపోవడం వల్ల వ్యవసాయ పనులకి కూలీలు దొరకడం లేదు. కొన్ని ప్రాంతాల్లో 500 రూపాయలు ఇచ్చినా కూలీలు దొరకడం లేదు. ఉపాధి హామీ పథకం ఏమీ చవకైనది కాదు కానీ పెట్రోల్ ధరలు పెంచడం, జి.ఎస్.టి. పేరుతో పన్నులు బాదడం లాంటి వాటి ద్వారా వచ్చిన డబ్బుతో ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తోంది. 
Tags: Economy

Don't be the product, buy the product!

Schweinderl