Newer posts are loading.
You are at the newest post.
Click here to check if anything new just came in.

November 12 2017

praveen2017
00:22

కాలంతో పాటు వ్యవస్థ అభివృద్ధి చెందాలా వద్దా?


ఈ సన్నివేశం గురించి మా అమ్మకి చెప్పాను. ఆవిడ అన్నారు "ఇప్పుడు కూడా అంతే, మనం చదివే చదువుకి చేసే ఉద్యోగంతో సంబంధం ఉండదు" అని. ఇంతకీ కాలంతో పాటు వ్యవస్థ అభివృద్ధి చెందాలా, వద్దా? ఇప్పుడు కూడా శ్రీ వి.వి.గిరికీ, గుమాస్తాగిరికీ ముడిపెడుతున్నారంటే దాని అర్థం మన వ్యవస్థ ఏమాత్రం మారలేదనే కదా

November 11 2017

praveen2017
08:08
5870 c78f 500
వేశ్యావృత్తి చేసే కులాలని కూడా సృష్టించెను మన సమాజం!

November 08 2017

praveen2017
12:32

ఇంగ్లిష్ మీడియం పేరుతో చెవిలో పువ్వు

మన దేశంలోని ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 85% మందికి ఇంగ్లిష్ సరిగా రాదు, మేనేజ్మెంట్ విద్యార్థుల్లో అయితే 94% మందికి ఇంగ్లిష్ సరిగా రాదు. వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వమే చెపుతోంది. మరి ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లని ఎందుకు నడుపుతున్నట్టు? జనం చెవుల్లో పూలు పెట్టడానికా? తెలుగు, హిందీ రెండూ భారతీయ భాషలు. అయినా తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి హిందీ రాదు. ఇంగ్లిష్ పూర్తిగా విదేశీ భాష. తెలుగు వ్యాకరణానికీ, ఇంగ్లిష్ వ్యాకరణానికీ మధ్య చాలా తేడా ఉంటుంది. మన పిల్లల్ని ఎంత బెత్తం దెబ్బలు కొట్టి వాళ్ళ చేత ఇంగ్లిష్ పాఠాలు చదివించినా వాళ్ళు పెద్దైన తరువాత జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంగ్లిష్ మాట్లాడలేరు. పట్టణంలో నెలకి పది వేలు అద్దెకి ఇల్లు తీసుకుని ఏడాదికి 36,000 ఫీజ్‌కి పిల్లవాడిని ప్రైవేట్ స్కూల్‌లలో చదివించడం తెలివైన పనేమీ కాదు, అది దండగమారి ఖర్చు.

November 05 2017

praveen2017
11:31

జెనెరల్ నాలెజ్ పేరుతో చెవిలో పువ్వు

చిన్నప్పుడు ఓ సారి మా నాన్నని అడిగాను "ప్రైవేట్ సెక్టర్‌లో రిజర్వేషన్ పెట్టడానికి అవుతుందా నాన్న?" అని. అవ్వదు అన్నాడు మా నాన్న. "వ్యక్తిగత ఆసక్తితో ఎవడైనా తన కంపెనీలో రిజర్వేషన్ పెడతాడా నాన్న?" అని అడిగాను. అలా ఎవడూ పెట్టడు అని మా నాన్న సమాధానం చెప్పాడు. నిజమే, వెనుకబడిన జాతుల సంక్షేమం ప్రైవేట్‌వాడి ఆబ్జెక్టివ్ కాదు. మరి జెనెరల్ నాలెజ్‌ని ప్రోత్సహించడం కూడా ప్రైవేట్‌వాడి ఆబ్జెక్టివ్ కాదు కదా, మరి బ్యాంక్ పి.ఓ. రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో జెనెరల్ నాలెజ్ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నట్టు? బ్యాంక్‌లో లెక్కలు వ్రాయడానికి ఇంగ్లిష్, లెక్కలూ వస్తే చాలు. మొండి బకాయీలు రికవరీ చెయ్యడానికి సివిల్ చట్టాల గురించీ, క్రిమినల్ చట్టాల గురించీ కొద్దిగా తెలియాలి. అంతే కానీ అబ్దుల్ కలాం గారి జన్మ స్థలం లాంటి జెనరల్ నాలెజ్ విషయాలతో దానికి సంబంధం లేదు. 

ఆకలి రాజ్యం సినిమాలో కమల్ హాసన్ గుమాస్తా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూయర్‌లు అతనికి శ్రీ వి.వి.గిరి ఇంటి పేరు అడుగుతారు. శ్రీ వి.వి.గిరి ఇంటి పేరు తనకి తెలుసు అంటూనే, శ్రీ వి.వి.గిరికీ, ఈ గుమాస్తాగిరికీ సంబంధం ఏమిటి అని కమల్ హాసన్ అడుగుతాడు. నువ్వు కమ్యూనిస్టువా అంటూ ఇంటర్వ్యూయర్‌లు కమల్ హాసన్‌ని తిడతారు. ఈ సన్నివేశం గురించి ఓ సారి మా పిన్నికి చెప్పాను. అది జెనరల్ నాలెజ్ రా అని సమాధానం చెప్పింది మా పిన్ని. నాకు ఫ్రాంక్లీన్ రూజ్వెల్ట్ పూర్తి పేరు కూడా తెలుసు. అయినా జనంలో జెనరల్ నాలెజ్‌ని ప్రోత్సహించడం ప్రైవేట్‌వాడి ఆబ్జెక్టివ్ కాదనే నేను నమ్ముతాను. 

పల్లెటూర్లలో బి.ఏ.లూ, ఎం.బి.ఏ.లూ చదువుకున్నవాళ్ళు తక్కువ. పల్లెటూరిలో రైస్ మిల్లు కట్టినవాడు తన కుటుంబ సభ్యుడినో, తనకి తెలిసినవాడినో గుమాస్తాగా పెట్టుకుని రైస్ మిల్లు నడుపుతాడు. అక్కడ వి.వి.గిరి ఇంటి పేరు తెలిసినవాడినో, ఇందిరా గాంధీ పుట్టిన తేదీ తెలిసినవాడినో గుమాస్తాగా సెలెక్ట్ చేసుకోవాలని ఎవరూ అనుకోరు. పట్టణాల్లో చదువుకున్నవాళ్ళు ఎక్కువ, ఉద్యోగాల్లో ఖాళీలు తక్కువ. అందుకే ఎం.బి.ఏ. చదివి ప్రైవేట్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆ అభ్యథికి ఏదో తక్కువ ఉందని చెప్పి అతనికి ఉద్యోగం ఇవ్వకుండా పంపించేస్తారు. అంతే కానీ జనంలోని జెనరల్ నాలెజ్‌తో ప్రైవేట్‌వాడికి ఏ సంబంధమూ లేదు. 

November 04 2017

praveen2017
06:10

వితంతు ఫించన్ పథకం విఫలమైనా అది పాలకులకి లాభమే

పూర్వం న్యాపతి సుబ్బారావు అనే సంఘ సంస్కర్త ఉండేవాడు. అతను మొదట్లో వీరేశలింగం గారిని ఎంతో అభిమానించేవాడు. అతని తమ్ముడు న్యాపతి శేషగిరి రావు ఒక విధవని పెళ్ళి చేసుకున్న తరువాత అతను వీరేశలింగం గారికి విరోధిగా మారాడు. తెలంగాణా చచ్చినా రాదనుకుని తెలంగాణావాదానికి మద్దతు ఇచ్చిన ఆంధ్రా మేధావుల్లాగ, విధవా వివాహాలు చచ్చినా జరగవనుకుని విధవా వివాహాలకి మద్దతు ఇచ్చిన సంఘ సంస్కర్తలు అప్పట్లో ఉండేవాళ్ళు. విధవా వివాహాలు జరగకుండా ఆపడానికి ప్రయత్నాలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. ఆ ప్రయత్నాలు విఫలమైనా కూడా ఆ పథకం రచించినవాళ్ళకి నష్టం లేదు. 

ఎలాగంటారా? మన పాలకులు విధవా వివాహాలు అవసరం లేదని చెప్పడానికి వితంతు ఫించన్ పథకం పెట్టారు. ఒక మహిళకి వితంతు ఫించన్ అందాలంటే ఆమె తన భర్త డెత్ సర్టిఫికేట్‌తో పాటు, ఆమె రెండో పెళ్ళి చేసుకోలేదనే సర్టిఫికేట్ చూపించాలి. అయితే పునర్వివాహిత విధవలు కాదు కానీ వివాహిత స్త్రీలే వితంతు ఫించన్ తీసుకుంటున్నారు. మా అమ్మ పని చేసిన బ్యాంక్‌లో పెన్షన్ అకౌంట్లు ఉన్నాయి కదా అని ఆవిడకి ఈ విషయం చెప్పాను. భర్త ఉన్న స్త్రీలు వితంతు ఫించన్ తీసుకుంటున్నారని అందరికీ తెలుసనీ, ఆ విషయం నేను కొత్తగా కనిపెట్టినట్టు చెపుతున్నాననీ అంటూ మా అమ్మ నన్నే విచిత్రంగా చూసింది. వితంతు ఫించన్ పథకం విఫలమైతే అయ్యింది కానీ ఆ వైఫల్యం వల్ల పాలకులకి వచ్చే నష్టం ఏమీ లేదు. భర్త ఉన్న స్త్రీకి వితంతు ఫించన్ ఇస్తే అలా ఇచ్చినందుకు ఆమె వోట్‌తో పాటు ఆమె భర్త వోట్ కూడా పాలక పార్టీకి పడుతుంది. ఆమె పిల్లలు మేజర్‌లు అయితే వాళ్ళు కూడా పాలక పార్టీకి వోట్ వేస్తారు. ఒక వివాహిత స్త్రీకి వితంతు ఫించన్ ఇస్తే పాలక పార్టీకి నాలుగు వోట్‌లు పడతాయి. ఫ్లాప్ సినిమాకి డబ్బింగ్ రైట్స్ అమ్మి డబ్బులు గడించే సినిమా నిర్మాత తెలివి లాంటిదే మన పాలకుల తెలివి. 
praveen2017
04:21

సంస్కారానికి కావలసినది సర్టిఫికేట్ కాదు

"చదువు సంస్కారం కోసం" అని చెప్పి జనాన్ని ఫూల్ చెయ్యొద్దు. మనిషికి వ్యవస్థపై భయం ఉంటేనే మనిషి నీతిగా వ్యవహరిస్తాడు. కేవలం స్కూల్ పుస్తకాల్లో వ్రాసే నీతి కథల వల్ల మనిషి నీతివంతుడిగా మారిపోడు. తనకి ఏమాత్రం సంబంధం లేని సివిల్ కేస్‌లో దూరి సెటిల్మెంట్‌లు చేసే పోలీస్ ఆఫీసర్ మాత్రం చదువుకున్నవాడు కాదా? సాధారణ జనంలో సివిల్ కేస్‌కీ, క్రిమినల్ కేస్‌కీ తేడా తెలియనివాళ్ళు ఉంటారు. ఉదాహరణకి రెంట్ కంట్రోలర్ గొడవల్ని సివిల్ కోర్ట్ చూస్తుందని తెలియక ఆ కేసుల్లో పోలీస్ స్టేషన్‌కి వెళ్ళేవాళ్ళు ఉంటారు. పోలీసులకి రెంట్ కంట్రోలర్ కేసులతో సంబంధం లేదని పోలీస్ ఆఫీసర్‌కి తప్పకుండా తెలుస్తుంది. అగ్రీమెంట్లని సివిల్ కోర్ట్ పరిశీలిస్తుంది తప్ప పోలీసులు పరిశీలించరు. ఓనర్‌కీ, టెనెంట్‌కీ మధ్య అగ్రీమెంట్ ఉన్నట్టైతే వాళ్ళు సివిల్ కోర్ట్‌కే వెళ్ళాలి. పోలీస్ ఆఫీసర్ ఆ సమయంలో ఆ విషయం తప్పకుండా చెప్పాలి. అది చెప్పకుండా లంచానికి కక్కుర్తి పడి ఆ కేస్‌లో దూరే పోలీస్ ఆఫీసర్‌లు ఉంటారు. సివిల్ కేసుల్లో దూరే పోలీస్ ఆఫీసర్లని వెంటనే సస్పెండ్ చేస్తే మిగితా పోలీస్ ఆఫీసర్లు సివిల్ కేసుల్లో దూరకుండా ఉంటారు. పోలీస్ ఆఫీసర్‌లలో LLB చదివినవాళ్ళు కొంత మంది ఉంటారు. రెంట్ కంట్రోలర్ కేసులతో పోలీసులకి సంబంధం లేదని LLB చదివినవాడికి కూడా తప్పకుండా తెలుస్తుంది. జనం తెలివితక్కువవాళ్ళు అనిపిస్తే LLB చదివిన పోలీస్ ఆఫీసర్ కూడా సివిల్ కేసుల్లో దూరగలడు. 

తమకి సివిల్ కేసులతో సంబంధం లేదని డైరెక్ట్‌గా చెప్పే పోలీస్ ఆఫీసర్‌లు కొంత మంది ఉన్నారు. పోలీసులు సివిల్ కేసుల్లో దూరితే మానవ హక్కుల కమిషన్‌కి కంప్లెయింట్ ఇవ్వొచ్చు. పోలీసులు ఒక కేసుని డీల్ చెయ్యకుండా ఆదేశించే అధికారం మానవ హక్కుల కమిషన్‌కి ఉంది కనుక కొంత మంది పోలీసులు సివిల్ విషయాలు ఎంక్వైరీ చెయ్యడానికి కూడా సాహసించరు. వ్యవస్థపై ఈ భయమే అందరికీ ఉండాలి. 

October 31 2017

praveen2017
04:35

బీర్ షాప్‌లకి లైసెన్సులు ఇచ్చేవాళ్ళకి బీర్ ఎలా తయారు చేస్తారో తెలియదు

మద్యం తాగడం తప్పు కాదు కానీ అది ఎక్కువ తాగితే తలనొప్పి లేదా మతిమరుపు లేదా లివర్ కేన్సర్ పట్టుకుంటుంది. బీర్ అనేది మత్తు మందు కదా, దాని వ్యాపారాన్ని ప్రోత్సహిస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరుగుతుంది అనే లెక్కతో ఆ మంత్రి బీర్‌ని హెల్త్ డ్రింక్ అన్నాడు కానీ పోషక విలువల్లో బీర్ కొబ్బరి నీరు కంటే గొప్పదేమీ కాదు. 

ఆ మంత్రికి మద్యం తయారీ గురించి తెలిసినది ఎంత తక్కువో, చంద్రబాబు నాయుడికి కూడా మద్యం తయారీ గురించి తెలిసినది అంతే తక్కువ. బ్రాందీని నిషేధిస్తే నాటు సారా వ్యాపారం పెరిగిపోతుంది అని గతంలో చంద్రబాబు నాయుడు ప్రచారం చేసేవాడు. బ్రాందీ కంటే నాటు సారాలో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉంటుంది. బ్రాందీ తాగడం వల్ల ఎక్కే మత్తు కంటే నాటు సారా వల్ల ఎక్కే మత్తు తక్కువ. బ్రాందీని high proof distillation ద్వారా తయారు చేస్తారు. అందు వల్ల బ్రాందీలో 40% పైగా ఆల్కహాల్ ఉంటుంది. బ్రాందీ తయారు చెయ్యడానికి పట్టే labour time ఎక్కువ. బ్రాందీ కంపెనీవాళ్ళు ప్రభుత్వానికి ఎక్సైజ్ కూడా కట్టాలి కనుక క్వార్టర్ బ్రాందీ రేటు వంద రూపాయలకి తక్కువ ఉండదు. అదే నాటు సారా అయితే ఒక లోటాకి ఇరవై రూపాయలు రేట్ ఉంటుంది. జీలుగు సారా రేట్ అయితే పది రూపాయల కంటే ఎక్కువ ఉండదు. కూలీ పని చేసేవాడు నాటు సారా లేదా జీలుగు రసం తాగుతాడు తప్ప బ్రాందీ తాగాలనుకోడు. బ్రాందీ షాప్‌లు ఎన్ని తెరిచినా నాటు సారా కొనేవాళ్ళు ఎక్కువే ఉంటారు. 

బీర్ అనేది non-distilled beverage. నాటు సారాలాగే అందులో కూడా ఆల్కహాల్ 15% కంటే ఎక్కువ ఉండదు. బీర్ కంపెనీవాళ్ళు ప్రభుత్వానికి ఎక్సైజ్ కడతారు కనుక బీర్ రేట్ కూడా ఎక్కువే ఉంటుంది. 

విదేశీ మద్యం మన ఆర్థిక వ్యవస్థకి లాభం కలిగించేది కాదు. బహుళజాతి కంపెనీల ఉత్పత్తుల మీద ఆధారపడడం వల్ల మన దేశ కరెన్సీ విలువే తగ్గిపోతుంది. మన దేశంలో తయారైనప్పటికీ బహుళ జాతి కంపెనీ బ్రాండ్ ఉన్న ఉత్పత్తులు కొనడం వల్ల కూడా సామ్రాజ్యవాద దేశాల కరెన్సీ విలువ పెరిగి మన కరెన్సీ విలువ తగ్గిపోతుంది. బహుళజాతి కంపెనీవాడు అమ్మే కూల్ డ్రింక్ కంటే కూడా జీలుగు సారే చవకైనది. ప్రభుత్వం విదేశీ మద్యాన్ని ప్రోత్సహించడం వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది కానీ దేశ ఆర్థిక వ్యవస్థకి మాత్రం అది భారమే. 

October 30 2017

praveen2017
14:23
అందాల పోటీలని నిషేధించాలనే నేను కూడా అంటాను. మగవాడికి అవసరం లేని అందం ఆడదానికి మాత్రం అవసరమా? ఆ point of viewలో అయితే అందాల పోటీలని వ్యతిరేకించాల్సిందే. అందాల పోటీలు ఆడదాన్ని వస్తువుగా మారుస్తున్నాయని మహిళా సంఘాల వాదన. కానీ అందాల పోటీలు చూడనివాళ్ళు కూడా ఆడదాన్ని వస్తువుగానే చూస్తున్నారనే విషయం ఇక్కడ మర్చిపోకూడదు. ఆ మధ్య విజయనగరంలో ట్రెయిన్‌లో పరిచయమైన ఒకాయన అన్నాడు "ఆడదాని అందాన్నీ, మగవాడి ఉద్యోగాన్నీ చూసి పెళ్ళి చేస్తారు" అని. ఆడదాన్ని వస్తువుగా చూసే సంస్కృతి మన నిత్య జీవితంలోనే ఉంది. అది కొత్తగా అందాల పోటీల వల్ల వచ్చినదేమీ కాదు. 

విదేశాల్లో ఆడవాళ్ళు కూడా మద్యం తాగుతారు. మన దేశంలో మగవాళ్ళు మాత్రమే మద్యం తాగుతారు. మన దేశంలో ఉన్న మహిళా సంఘాలకి ఈ విషయం తెలియదు, నిజమే. పాలకవర్గంవాళ్ళకి కూడా స్త్రీవాదం గురించి ఏమీ తెలియదు. ఆడవాళ్ళని బట్టలు విప్పి చూపించే అందాల పోటీలని "ఆడపిల్లని రక్షించండి" అనే స్లోగన్ కోసం వాడాలనుకునే గంటా శ్రీనివాసరావు లాంటి మంత్రులకి స్త్రీవాదం అంటే ఏమిటో ఒక్క ముక్క కూడా తెలియదు. సారా వ్యాపారాన్ని వ్యతిరేకించే ఒక మహిళా సంఘానికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. నిజంగా స్త్రీవాదాన్ని ఆచరించేవాళ్ళని మాత్రం ప్రభుత్వం సహిస్తుందా?

అందాల పోటీల వల్ల కాస్మెటిక్స్ కంపెనీలకి సేల్స్ పెరుగుతాయి. ఆ పోటీలు లేకపోతే కాస్మెటిక్స్ కంపెనీలు మూతపడతాయి. అయితే జనంలో ఉన్న భావజాలంలో మాత్రం తేడా రాదు. తెలంగాణా చచ్చినా రాదు అని ఆంధ్రాలో అందరూ అనుకుంటున్న సమయంలో, నేను ఆంధ్రుణ్ణి అయ్యుండీ తెలంగాణా ఉద్యమానికే మద్దత్తు ఇచ్చాను. అలాగే అందాల పోటీ అనేది మోడర్నిజం అని వైజాగ్ అమ్మాయిలు అందరూ నమ్మినా నేను అందాల పోటీలకి వ్యతిరేకంగానే ఉంటాను. 
— Praveen
praveen2017
05:25

విధవలు విధవలుగానే ఉండాలని చెపుతున్న వితంతు ఫించన్ పథకం

భర్త చనిపోయిన తరువాత రెండో పెళ్ళి చేసుకున్న స్త్రీకి వితంతు ఫించన్ అవసరం లేదు. వితంతు ఫించన్ పథకం ఉందంటే దాని అర్థం భర్త చనిపోయిన స్త్రీలలో 90% మంది రెండో పెళ్ళి చేసుకోవడం లేదనే, కానీ అది హిందూ కుటుంబాల్లోనే అలా. ముస్లిం కుటుంబంలో స్త్రీకి భర్త చనిపోతే ఆమెకి మూడు నెలల తరువాత రెండో పెళ్ళి చేస్తారు. ముస్లిం స్త్రీకి వితంతు ఫించన్ ఏమాత్రం అవసరం లేదు. విధవలు విధవలుగానే ఉండాలని చెప్పడానికి మన పాలకులు వితంతు ఫించన్ పథకం పెట్టారు కానీ అది బెడిసికొట్టింది. భర్త చనిపోయిన తరువాత రెండో పెళ్ళి చేసుకున్న స్త్రీలు కాదు, భర్త బతికున్న స్త్రీలే వితంతు ఫించన్ కోసం అప్లై చేస్తున్నారు. ఒక గ్రామ సర్పంచ్ 60 మంది భర్త ఉన్న స్త్రీలకి వితంతు ఫించన్ రికమెండ్ చేసాడు. ఈ వార్త చదవండి: 

October 26 2017

praveen2017
00:36

సోషలిస్ట్ విప్లవం రాదనిపిస్తే మావోయిస్ట్‌లకే వోట్‌లు వేస్తారా?

ఆంధ్రా జనానికి బాగుపడే యోగం లేదు. "తెలంగాణా చచ్చినా రాదనుకుని తెలంగాణాకి అనుకూలంగా లేఖ వ్రాసిన చంద్రబాబు నాయుడే ఆంధ్రాకి ముఖ్యమంత్రి అయ్యాడు కదా, ఆంధ్రా కాంగ్రెస్ నాయకులు కూడా తెలంగాణా చచ్చినా రాదనుకుని తాము సోనియా నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు, మరి చంద్రబాబుకీ, ఆంధ్రా కాంగ్రెస్ నాయకులకీ మధ్య తేడా ఏమిటి?" అని అడిగినందుకు ఈ మధ్యనే ఇద్దరుముగ్గురు నా మీద కోపమైపోయారు. ఈ గొర్రెల మంద ఉన్నంత వరకు మన రాష్ట్రం బాగుపడదు.

తెలుగు దేశం పార్టీ గతంలో సారా వ్యతిరేక ఉద్యమం నడిపింది. ఎన్నికలకి ముందు తెలుగు దేశం కార్యకర్తలు బ్రాందీ షాపులనీ, సారా బట్టీలనీ ధ్వంసం చేసారు. వాళ్ళు కాంగ్రెస్‌ని ఓడించేంతవరకు మద్యం వ్యతిరేక ఉద్యమం నడిపారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత NTR మద్యాన్ని నిషేధించాడు కానీ చంద్రబాబు నాయుడు ఆ నిషేధాన్ని ఎత్తి వేసి, విదేశీ మద్యాన్ని నిషేధిస్తే దేశీ సారా వ్యాపారం పెరుగుతుందని ప్రచారం చేసాడు. ఈ దొంగ సన్నాసి బాబుకి మావోయిస్టులని అణచివేస్తే స్టాలినిస్టులు పెరుగుతారనే అనుమానం మాత్రం రాలేదు. ఇదే దొంగ సన్నాసి బాబు తెలంగాణాకి అనుకూలంగా తెలంగాణలో, తెలంగాణాకి వ్యతిరేకంగా ఆంధ్రాలో మాట్లాడడం విచిత్రం కాదు. 

October 20 2017

praveen2017
12:39
praveen2017
03:38

పండగలనాడే పవిత్రత అవసరమా?

నేను దీపావళి నాడు జీలుగు కల్లు తాగాను, నిజం. పండగ నాడు మద్యం ముట్టుకోకూడదు, మాంసం ముట్టుకోకూడదు కానీ మిగితా రోజులు అవి ఎంత కక్కుర్తి పడి బుక్కినా పర్వాలేదు అనుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా నేను నిన్న గ్రామస్తులు చూస్తుండగానే జీలుగు రసం వేసుకున్నాను. 
Older posts are this way If this message doesn't go away, click anywhere on the page to continue loading posts.
Could not load more posts
Maybe Soup is currently being updated? I'll try again automatically in a few seconds...
Just a second, loading more posts...
You've reached the end.

Don't be the product, buy the product!

Schweinderl