Newer posts are loading.
You are at the newest post.
Click here to check if anything new just came in.

March 27 2018

praveen2017
06:32

భాజపా పాలనలో పెరిగిన ఆవు మాంసం ఎగుమతి

ఆవుని రక్షించడానికి మనిషిని చంపడాన్ని ఎవరూ అహింసావాదం అనరు కానీ గోరక్షణ పేరుతో దళితులూ, ముస్లింలపై దాడులు చెయ్యించే భాజపా పాలనలో ఆవు మాంసం ఎగుమతి పెరిగింది. ఆవు కొవ్వు ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని భాజపా ప్రభుత్వమే రద్దు చేసింది. ఆవు మాంసం ప్రాసెసింగ్ చేసే కంపెనీలని ఏమీ చెయ్యకుండా దళితుల్నీ, ముస్లింలనీ మాత్రమే గోరక్షణ పేరుతో చంపితే ఆవు మాంసం వ్యాపారం ఎలా తగ్గుతుంది? 

మన దేశంలో ఉన్నది human intensive production, పాశ్చాత్య దేశాల్లో ఉన్నది machine intensive production. పది మంది చేసే పని ఒక మెషీన్ చెయ్యగలదు. అమెరికా, జపాన్‌లలో మెషీన్‌లతోనే వ్యవసాయం చేస్తారు. కూలీల చేత వ్యవసాయం చెయ్యిస్తే కూలీవాళ్ళు బతకడానికి అయ్యే ఖర్చు మనమే భరించాలి. ఇద్దరు మనుషుల మధ్య ఉన్నది వస్తు మార్పిడి సంబంధమే అంటాడు మార్క్స్. శ్రమని కొనేవాడికీ, శ్రమని అమ్ముకునేవాడికీ మధ్య ఉన్నది కూడా ఆ సంబంధమే. ఒకరి హక్కుల్ని ఇంకొకరు పరస్పరం గుర్తించాలి అంటాడు మార్క్స్. కూలీవాడు ఒక రోజు బతకడానికి ఎంత ఖర్చవుతుందో, ఆ రోజు అతని శ్రమని కొనేవాడే భరించాలి. కూలీవాళ్ళని పోషించడానికి అయ్యే ఖర్చు కంటే మెషీన్‌ని మెయింటెయిన్ చెయ్యడానికి అయ్యే ఖర్చు తక్కువ అనిపిస్తే మనం మెషీన్ వైపే మొగ్గు చూపుతాం. జనాభా పెరిగితే చీప్ లేబర్ దొరుకుతుందని నమ్మేవాళ్ళలో కొంత మంది ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు కానీ వాళ్ళ అభిప్రాయం తప్పు. జనాభా ఎంత ఉన్నా కూలీవాడు బతకడానికి అయ్యే ఖర్చు అతని శ్రమని కొనేవాడు భరించాల్సిందే. 

జనాభా పెరిగితే నిరుద్యోగం పెరిగుతుందనీ, నిరుద్యోగం పెరిగితే చీప్ లేబర్ దొరుకుతారనీ ఒకప్పుడు నేను కూడా నమ్మేవాణ్ణి. నిరుద్యోగం ఎంత పెరిగినా శ్రామికుడు బతకడానికి అయ్యే ఖర్చుని అతని శ్రమని కొనేవాడే భరించాలి. 

పల్లెటూర్లలో ఇల్లు 700 రూపాయలకే అద్దెకి దొరుకుతుంది. పట్టణంలో అయితే అది 5,000 రూపాయల కంటే తక్కువ ధరకి దొరకదు. ఇంగ్లిష్ మీడియం స్కూల్‌కి దగ్గరలో అయితే అది 15,000 రూపాయలు కూడా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగి జీతానికీ, పారిశ్రామిక ఉద్యోగి జీతానికీ మధ్య పెద్ద తేడా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం కోసం అంత ఖర్చు పెట్టి ఎవరూ ఇంగ్లిష్ మీడియం చదువులు చదవరు.

ఇప్పుడు కూడా పశువులు కాసేవాళ్ళలో సగం మందికి చదువు రాదు. వాళ్ళు ప్రకృతి గురించి తమకి తెలిసిన జ్ఞానంతోనే పశువులు పెంచుతారు. వాళ్ళెవరూ B.Sc. (Biology) చదివి పశువులు పెంచాలనుకోరు. అయినప్పటికీ పశువులు పెంచడానికి average labour time ఎక్కువే పడుతుంది. కిలో కోడి మాంసం ఉత్పత్తికి 3 కెజిల దాణా అవసరం అయితే కిలో మేక మాంసం ఉత్పత్తికి 7 కెజిల దాణా అవసరం. కోళ్ళ ఫార్మ్‌లలో ఈగల్ని చంపడానికి ఖరీదైన మందులు కూడా వాడుతారు. మాంసం ఉత్పత్తి చెయ్యడానికి average labour time ఎక్కువ పడుతుంది కాబట్టే మాంసం ధర ఎక్కువ. ఆ ధర సమస్య వల్లే జనం ఎక్కువగా శాకాహారం తింటారు. అంతే కానీ శాకాహారం పాపులర్ అవ్వడానికి కారణం అహింసావాదం కాదు.

Don't be the product, buy the product!

Schweinderl