Newer posts are loading.
You are at the newest post.
Click here to check if anything new just came in.

January 05 2018

praveen2017
12:20

The counterproductivity of education

లిల్లీ: నీకేమీ పని లేదా? ఎప్పుడూ ఆ అమ్మాయికే లైన్ వేస్తూ ఉంటావ్?
బాబీ: తప్పేమిటి? ఆ అమ్మాయి హిందూ సంప్రదాయం ప్రకారం నాకు మరదలు అవుతుంది.
లిల్లీ: ఇంకేదో మత సంప్రదాయం ప్రకారం ఆమె నీకు ఇంకేదో వరస కావచ్చు, కానీ నువ్వు ఆమెని పెళ్ళి చేసుకోవాలంటే ఆమె అంగీకారం ముఖ్యం. దీనికి వరసలు కలవడం ఒక్కటే అర్హత కాదనుకుంటాను!
బాబీ: What do you mean?
లిల్లీ: వరసలు అనేవి ఒక్కో మతంలో ఒక్కోలాగ ఉంటాయి. ఆ polemics నీకు అర్థం అయితే పర్వా లేదు. పెళ్ళికి వరసలు కలవడం ఒక్కటే అర్హత కాదని మాత్రం నేను గట్టిగా చెప్పగలను.
బాబీ: నేను గవర్నమెంట్ ఉద్యోగిని, నా జీతం నలభై వేలు. నేను పని సరిగా చెయ్యకపోయినా నా ఉద్యోగం పోదు. నా సంపాదన చూసి ఏ అమ్మాయైనా నా లైన్‌లో పడదా? 
లిల్లీ: నీ దృష్టిలో పెళ్ళి అనేది ఆర్థిక సంబంధమే తప్ప మానసిక సంబంధం కాదా?
బాబీ: ఇందులో తప్పేమిటి? ఆడదాని అందాన్నీ, మగవాడి ఉద్యోగాన్నీ చూసి పెళ్ళి చేస్తారు.
లిల్లీ: నేను డాక్టర్‌ని, నా భర్త నిరుద్యోగి. అయినా మేము ఎలా పెళ్ళి చేసుకున్నాం?
బాబీ: ఏమో? నువ్వు చదువుకున్న నిరుద్యోగిని పెళ్ళి చేసుకుని ఉంటావ్. Industrial labourగా పని చెయ్యడానికి సిద్ధంగా ఉన్న నిరుద్యోగినైతే నువ్వు పెళ్ళి చేసుకునేదానివా? 
లిల్లీ: నీ అభిప్రాయం ప్రకారం చదువు అనేది గవర్నమెంట్ ఉద్యోగం కోసమేనన్నమాట! Industrial workerకి చదువు అవసరం లేదంటావ్. మన దేశంలో చదువుకున్నవాళ్ళలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ప్రాకులాడుతున్నారు తప్ప పరిశ్రమల్లో పని చెయ్యడానికి ఒప్పుకోవడం లేదని నీ మాటల్లోనే తెలిసిపోతోంది. ఈ పోకడ సమాజానికి counter-productive తప్ప productive ఏమాత్రం కాదు. 

November 08 2017

praveen2017
12:32

ఇంగ్లిష్ మీడియం పేరుతో చెవిలో పువ్వు

మన దేశంలోని ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 85% మందికి ఇంగ్లిష్ సరిగా రాదు, మేనేజ్మెంట్ విద్యార్థుల్లో అయితే 94% మందికి ఇంగ్లిష్ సరిగా రాదు. వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వమే చెపుతోంది. మరి ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లని ఎందుకు నడుపుతున్నట్టు? జనం చెవుల్లో పూలు పెట్టడానికా? తెలుగు, హిందీ రెండూ భారతీయ భాషలు. అయినా తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి హిందీ రాదు. ఇంగ్లిష్ పూర్తిగా విదేశీ భాష. తెలుగు వ్యాకరణానికీ, ఇంగ్లిష్ వ్యాకరణానికీ మధ్య చాలా తేడా ఉంటుంది. మన పిల్లల్ని ఎంత బెత్తం దెబ్బలు కొట్టి వాళ్ళ చేత ఇంగ్లిష్ పాఠాలు చదివించినా వాళ్ళు పెద్దైన తరువాత జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంగ్లిష్ మాట్లాడలేరు. పట్టణంలో నెలకి పది వేలు అద్దెకి ఇల్లు తీసుకుని ఏడాదికి 36,000 ఫీజ్‌కి పిల్లవాడిని ప్రైవేట్ స్కూల్‌లలో చదివించడం తెలివైన పనేమీ కాదు, అది దండగమారి ఖర్చు.

November 05 2017

praveen2017
11:31

జెనెరల్ నాలెజ్ పేరుతో చెవిలో పువ్వు

చిన్నప్పుడు ఓ సారి మా నాన్నని అడిగాను "ప్రైవేట్ సెక్టర్‌లో రిజర్వేషన్ పెట్టడానికి అవుతుందా నాన్న?" అని. అవ్వదు అన్నాడు మా నాన్న. "వ్యక్తిగత ఆసక్తితో ఎవడైనా తన కంపెనీలో రిజర్వేషన్ పెడతాడా నాన్న?" అని అడిగాను. అలా ఎవడూ పెట్టడు అని మా నాన్న సమాధానం చెప్పాడు. నిజమే, వెనుకబడిన జాతుల సంక్షేమం ప్రైవేట్‌వాడి ఆబ్జెక్టివ్ కాదు. మరి జెనెరల్ నాలెజ్‌ని ప్రోత్సహించడం కూడా ప్రైవేట్‌వాడి ఆబ్జెక్టివ్ కాదు కదా, మరి బ్యాంక్ పి.ఓ. రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో జెనెరల్ నాలెజ్ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నట్టు? బ్యాంక్‌లో లెక్కలు వ్రాయడానికి ఇంగ్లిష్, లెక్కలూ వస్తే చాలు. మొండి బకాయీలు రికవరీ చెయ్యడానికి సివిల్ చట్టాల గురించీ, క్రిమినల్ చట్టాల గురించీ కొద్దిగా తెలియాలి. అంతే కానీ అబ్దుల్ కలాం గారి జన్మ స్థలం లాంటి జెనరల్ నాలెజ్ విషయాలతో దానికి సంబంధం లేదు. 

ఆకలి రాజ్యం సినిమాలో కమల్ హాసన్ గుమాస్తా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూయర్‌లు అతనికి శ్రీ వి.వి.గిరి ఇంటి పేరు అడుగుతారు. శ్రీ వి.వి.గిరి ఇంటి పేరు తనకి తెలుసు అంటూనే, శ్రీ వి.వి.గిరికీ, ఈ గుమాస్తాగిరికీ సంబంధం ఏమిటి అని కమల్ హాసన్ అడుగుతాడు. నువ్వు కమ్యూనిస్టువా అంటూ ఇంటర్వ్యూయర్‌లు కమల్ హాసన్‌ని తిడతారు. ఈ సన్నివేశం గురించి ఓ సారి మా పిన్నికి చెప్పాను. అది జెనరల్ నాలెజ్ రా అని సమాధానం చెప్పింది మా పిన్ని. నాకు ఫ్రాంక్లీన్ రూజ్వెల్ట్ పూర్తి పేరు కూడా తెలుసు. అయినా జనంలో జెనరల్ నాలెజ్‌ని ప్రోత్సహించడం ప్రైవేట్‌వాడి ఆబ్జెక్టివ్ కాదనే నేను నమ్ముతాను. 

పల్లెటూర్లలో బి.ఏ.లూ, ఎం.బి.ఏ.లూ చదువుకున్నవాళ్ళు తక్కువ. పల్లెటూరిలో రైస్ మిల్లు కట్టినవాడు తన కుటుంబ సభ్యుడినో, తనకి తెలిసినవాడినో గుమాస్తాగా పెట్టుకుని రైస్ మిల్లు నడుపుతాడు. అక్కడ వి.వి.గిరి ఇంటి పేరు తెలిసినవాడినో, ఇందిరా గాంధీ పుట్టిన తేదీ తెలిసినవాడినో గుమాస్తాగా సెలెక్ట్ చేసుకోవాలని ఎవరూ అనుకోరు. పట్టణాల్లో చదువుకున్నవాళ్ళు ఎక్కువ, ఉద్యోగాల్లో ఖాళీలు తక్కువ. అందుకే ఎం.బి.ఏ. చదివి ప్రైవేట్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆ అభ్యథికి ఏదో తక్కువ ఉందని చెప్పి అతనికి ఉద్యోగం ఇవ్వకుండా పంపించేస్తారు. అంతే కానీ జనంలోని జెనరల్ నాలెజ్‌తో ప్రైవేట్‌వాడికి ఏ సంబంధమూ లేదు. 

November 04 2017

praveen2017
04:21

సంస్కారానికి కావలసినది సర్టిఫికేట్ కాదు

"చదువు సంస్కారం కోసం" అని చెప్పి జనాన్ని ఫూల్ చెయ్యొద్దు. మనిషికి వ్యవస్థపై భయం ఉంటేనే మనిషి నీతిగా వ్యవహరిస్తాడు. కేవలం స్కూల్ పుస్తకాల్లో వ్రాసే నీతి కథల వల్ల మనిషి నీతివంతుడిగా మారిపోడు. తనకి ఏమాత్రం సంబంధం లేని సివిల్ కేస్‌లో దూరి సెటిల్మెంట్‌లు చేసే పోలీస్ ఆఫీసర్ మాత్రం చదువుకున్నవాడు కాదా? సాధారణ జనంలో సివిల్ కేస్‌కీ, క్రిమినల్ కేస్‌కీ తేడా తెలియనివాళ్ళు ఉంటారు. ఉదాహరణకి రెంట్ కంట్రోలర్ గొడవల్ని సివిల్ కోర్ట్ చూస్తుందని తెలియక ఆ కేసుల్లో పోలీస్ స్టేషన్‌కి వెళ్ళేవాళ్ళు ఉంటారు. పోలీసులకి రెంట్ కంట్రోలర్ కేసులతో సంబంధం లేదని పోలీస్ ఆఫీసర్‌కి తప్పకుండా తెలుస్తుంది. అగ్రీమెంట్లని సివిల్ కోర్ట్ పరిశీలిస్తుంది తప్ప పోలీసులు పరిశీలించరు. ఓనర్‌కీ, టెనెంట్‌కీ మధ్య అగ్రీమెంట్ ఉన్నట్టైతే వాళ్ళు సివిల్ కోర్ట్‌కే వెళ్ళాలి. పోలీస్ ఆఫీసర్ ఆ సమయంలో ఆ విషయం తప్పకుండా చెప్పాలి. అది చెప్పకుండా లంచానికి కక్కుర్తి పడి ఆ కేస్‌లో దూరే పోలీస్ ఆఫీసర్‌లు ఉంటారు. సివిల్ కేసుల్లో దూరే పోలీస్ ఆఫీసర్లని వెంటనే సస్పెండ్ చేస్తే మిగితా పోలీస్ ఆఫీసర్లు సివిల్ కేసుల్లో దూరకుండా ఉంటారు. పోలీస్ ఆఫీసర్‌లలో LLB చదివినవాళ్ళు కొంత మంది ఉంటారు. రెంట్ కంట్రోలర్ కేసులతో పోలీసులకి సంబంధం లేదని LLB చదివినవాడికి కూడా తప్పకుండా తెలుస్తుంది. జనం తెలివితక్కువవాళ్ళు అనిపిస్తే LLB చదివిన పోలీస్ ఆఫీసర్ కూడా సివిల్ కేసుల్లో దూరగలడు. 

తమకి సివిల్ కేసులతో సంబంధం లేదని డైరెక్ట్‌గా చెప్పే పోలీస్ ఆఫీసర్‌లు కొంత మంది ఉన్నారు. పోలీసులు సివిల్ కేసుల్లో దూరితే మానవ హక్కుల కమిషన్‌కి కంప్లెయింట్ ఇవ్వొచ్చు. పోలీసులు ఒక కేసుని డీల్ చెయ్యకుండా ఆదేశించే అధికారం మానవ హక్కుల కమిషన్‌కి ఉంది కనుక కొంత మంది పోలీసులు సివిల్ విషయాలు ఎంక్వైరీ చెయ్యడానికి కూడా సాహసించరు. వ్యవస్థపై ఈ భయమే అందరికీ ఉండాలి. 

October 20 2017

praveen2017
12:39
Older posts are this way If this message doesn't go away, click anywhere on the page to continue loading posts.
Could not load more posts
Maybe Soup is currently being updated? I'll try again automatically in a few seconds...
Just a second, loading more posts...
You've reached the end.

Don't be the product, buy the product!

Schweinderl