Newer posts are loading.
You are at the newest post.
Click here to check if anything new just came in.

November 25 2017

praveen2017
00:46

తరతరాల నిజాం బూజుని నమ్ముకునేది బాగుపడడానికా?

పూర్వం రాజులూ, జమీందార్లూ భోగం కులానికి చెందిన స్త్రీలని ఉంపుడుగత్తెలుగా ఉంచుకునేవాళ్ళు. వాళ్ళ రాజధానుల్లో వేశ్యావృత్తి ప్రబలంగానే ఉండేది. పెద్దాపురం, వేల్పూరులు ఒకప్పటి జమీందారీ సంస్థాన కేంద్రాలు కావడం వల్ల అక్కడ ఇప్పుడు కూడా వేశ్యావృత్తి కొనసాగుతోంది. వేశ్యా వాటికల్ని నిర్మూలించాలనేవాడు పెద్దాపురం రాజావారిని గొప్ప స్త్రీవాది అంటూ పొగిడితే ఎలా ఉంటుంది? తెలంగాణావాది నిజాం బూజుని పొగిడినా అలాగే ఉంటుంది!     

బ్రిటిష్ పరిపాలనలో మన దేశంలో అక్షరాస్యత 12% మాత్రమే ఉండేది. అప్పట్లో మన దేశంలో అక్షరాస్యత అత్యధికంగా ఉన్న సంస్థానం బరోడా. బరోడా సంస్థానంలో 33% అక్షరాస్యత ఉండేది. అప్పట్లో అత్యల్ప అక్షరాస్యత గల సంస్థానం హైదరాబాద్. హైదరాబాద్ సంస్థానంలో అక్షరాస్యత 4.8% మాత్రమే ఉండేది. జనం తమ నిజ జీవితంలో ఉపయోగించని ఉర్దూ భాషని మాధ్యమంగా పెట్టి చదువు నేర్పించడం వల్ల అలా జరిగింది అనుకుందామా? హైదరాబాద్ రాష్ట్ర వెనుకబాటుకి కారణాలలో ఉర్దూ మీడియం ఒకటి మాత్రమే. ఆర్థికంగా కూడా హైదరాబాద్ రాష్ట్రం బాగుపడిందేమీ లేదు. హైదరాబాద్ రాష్ట్రంలోని భూమిలో 10% నిజాం సొంత ఎస్టేట్, 30% భూమి జాగీర్దార్‌ల ఎస్టేట్‌లు, మిగితా 60% ప్రభుత్వ భూమి. సొంత ఆస్తి వ్యవస్థ ఇంత బలంగా ఉన్నప్పుడు ఆర్థిక అసమానతలు కూడా ఎక్కువే ఉంటాయి. ఎక్కడైనా ఆర్థికంగా ముందున్నవాళ్ళే చదువుపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు తప్ప ఆర్థికంగా వెనుకబడినవాళ్ళకి చదువు మీద అంత ఆసక్తి ఉండదు. 

నిజాం బూజు వల్లే తెలంగాణా వెనుకబడిందని ఒప్పుకోవడం MIMకి ఇష్టం లేదు. తెలంగాణా వెనుకబడలేదు అనే ఇంప్రెషన్ కలిగించడానికి MIM తెలంగాణా ఏర్పాటుని వ్యతిరేకించింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. తెలంగాణా ఏర్పడితే ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయి అని ప్రచారం చేసిన రాజశేఖర రెడ్డికి కూడా ఈ విషయం తెలిసి ఉండదు. రాజశేఖరరెడ్డి ముస్లింల వోట్ల కోసం బహిరంగంగానే నిజామ్‌ని పొగిడాడు. సిపాయిల తిరుగుబాటు సమయంలో నిజాం ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన తురేహ్‌బాజ్ ఖాన్, మౌల్వీ అలాఉద్దీన్, ముబారిజుద్దౌలా తదితరులు ముస్లింలేనని రాజశేఖరరెడ్డికి తెలిసి ఉండదు. ఇప్పుడు నిజాం భజన కీర్తనలు పాడుతున్న కె.సి.ఆర్. బృందానికి కూడా ఈ చరిత్ర తెలిసి ఉండదు. రేప్‌కి గురైన స్త్రీని ఆమెని రేప్ చేసినవాడికే ఇచ్చి పెళ్ళి చెయ్యడం ఎలాంటిదో, తెలంగాణా వెనుకబాటుకి కారణమైన నిజాం బూజుని తెలంగాణాకి వారసత్వంగా అందించడం అలాంటిది. 

Don't be the product, buy the product!

Schweinderl