Newer posts are loading.
You are at the newest post.
Click here to check if anything new just came in.

May 22 2018

praveen2017
05:44

తీవ్రవాదులని పట్టుకోవడానికి ఇంత కంటే మంచి మార్గం దొరకలేదా?

కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల్లో లొంగిపోయిన తీవ్రవాదులకి నాలుగు లక్షలు రివార్డ్ ఇస్తుందట! ఆరు వేలు పెన్షన్ కూడా ఇస్తుందట! లక్ష రూపాయలు వెంటనే ఇచ్చి మిగితాది తరువాత ఇస్తుందట! ఈశాన్య రాష్ట్రాలో పరిశ్రమలు పెట్టి స్థానికులకి ఉద్యోగాలు ఇస్తే అక్కడి జనం తీవ్రవాదుల్లో చేరరు కదా, మరి తీవ్రవాదుల్ని అణచివెయ్యడానికి అంత మొత్తం రివాడ్‌లు ఎందుకు? ఆంధ్ర ప్రదేశ్‌లో లొంగిపోయిన మావోయిస్ట్‌లకి ఇచ్చే రివార్డ్ 35,000 మాత్రమే. మొదట ఇచ్చేది 5,000. మిగితాది తరువాత ఇస్తారు. ఇన్‌ఫార్మర్‌గా మారి తమకి గుర్తున్న ముఖాలని పట్టివ్వకపోతే అది కూడా ఇవ్వరు.

అవిభక్త ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రం లొంగుబాట్ల విధానం సక్సెస్ అయ్యింది. ఇన్‌ఫార్మర్‌లుగా మారినవాళ్ళకి మాత్రమే రివార్డులు ఇస్తారని చాలా మందికి తెలియదు. నయీం, కత్తుల సమ్మయ్య, జడల నాగరాజు, బయ్యపు సమ్మిరెడ్డి లాంటివాళ్ళ విలాసవంతమైన జీవితం చూసి, దాని కోసం చాలా మంది లొంగిపోయారు. ఈశాన్య రాష్ట్రాలలోని లొంగుబాట్ల విధానం మాత్రం ఫెయిల్ అవుతుందనే ఖచ్చితంగా చెప్పగలను. లొంగిపోయిన వ్యక్తిని స్టేషన్ హౌస్ ఆఫీసరే స్క్రీనింగ్ చేస్తాడు. అతను తీవ్రవాది కాదు, రివార్డ్ కోసం తాను తీవ్రవాదినని చెప్పుకుని లొంగిపోయాడు అని స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కి తెలిసిందనుకుందాం. స్టేషన్ హౌస్ ఆఫీసర్ అతనితో డబ్బులు పంచుకోవడానికి అతన్ని లొంగిపోయిన తీవ్రవాదిగానే చూపించగలడు. చత్తీస్‌గడ్‌లో లొంగిపోయిన తీవ్రవాదులకి ఇచ్చే గ్రాంట్ పదివేలు మాత్రమే కానీ ఆ పదివేలు గ్రాంట్ కోసం కూడా నకిలీ లొంగుబాట్లు జరుగుతున్నాయి.
Tags: State
praveen2017
05:25

పోలీసుల చేత కూడా పని చెయ్యించలేని చేతకాని ప్రభుత్వం!

కుబుసం సినిమా మళ్ళీ చూసాను. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ సరిగా పని చెయ్యరు అని ఆ సినిమా రచయితకి తెలుసు కానీ అందుకు కారణాలు ఆయనకి సరిగా తెలియదు. మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకి జీతం చాలా ఎక్కువ కానీ ప్రభుత్వ ఉద్యోగం రావడానికి ఇంగ్లిష్ తప్పనిసరి. ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు తన పిల్లల్ని ప్రభుత్వ ఉద్యోగానికే పంపించాలనుకుంటాడు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పట్టణాల్లో ఇళ్ళు అద్దెలకి తీసుకుని తమ పిల్లల్ని ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో చదివిస్తూ, గ్రామాలకి మాత్రం వారానికి ఒకసారి వచ్చి పోతుంటారు. నిజ జీవితంలో అలా పని చేసే ఒక రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌నీ, ఒక అమీన్‌నీ ఒరిస్సా రాష్ట్రంలో చూసాను. అంగన్‌వాడీ వర్కర్‌లకి జీతాలు మరీ ఎక్కువ ఇచ్చి, దానికి కూడా ఇంగ్లిష్ మీడియమ్‌ని మాండేట్ చేసినా, అంగన్వాడీ వర్కర్లు కూడా గ్రామాల్లో పని చెయ్యకుండా తమ పిల్లల్ని పట్టణాల్లోని ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లలో చదివించుకుంటూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగుల పని తీరు గురించి ఇంత క్లియర్‌గా చెప్పలేకపోయాడు ఆ సినిమా రచయిత. 

పోలీసుల తెలివితేటలు మాత్రం ఆ రచియతకి బాగా తెలుసు. ఆ సినిమాలో వీక్ ఎలిమెంట్ అయిన ఒక విప్లవకారుడు పోలీసులకి లొంగిపోతానంటాడు. "నువ్వు లొంగిపోతే మాకేంటి లాభం? నువ్వు దళ కమాండర్‌వి కూడా కాదు" అని పోలీస్ ఆఫీసర్ అంటాడు. దళ కమాండర్‌కైతే వేరే దళాలలో పని చేసేవాళ్ళ ముఖాలు కూడా తెలుస్తాయి. దళ కమాండర్ లొంగిపోతే అతను ఇన్‌ఫార్మర్‌గా పనికొస్తాడు. నిజ జీవితంలో పోలీసులు నయీంని అలాగే ఇన్‌ఫార్మర్‌గా వాడుకున్నారు కదా. నిజ జీవితంలో దళ డెప్యూటీ కమాండర్‌గా పని చేసి లొంగిపోయిన కత్తుల సమ్మయ్యకి కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. సోమ్లా నాయక్‌కి మాత్రం పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు. అతన్ని వాడుకుని వదిలేసారు. అతను చివరికి దొంగతనాలు చేసుకుంటూ బతికాడు. అతను ఓ గ్రామంలో దొంగతనం చేస్తుండగా జనం అతన్ని కొట్టి చంపారు. 

పోలీసులు లేకపోతే దొంగతనాలూ, రేప్‌లూ పెరిగిపోతాయి కానీ మన దేశంలో కొన్ని చోట్ల పోలీసులు కూడా సరిగా పని చెయ్యరు. ఒరిస్సాలోని శేషికల్ పోలీస్ స్టేషన్ ఉద్యోగుల్లో ఇన్స్పెక్టర్-ఇన్-చార్జ్ తప్ప ఎవరూ శేషికల్ గ్రామంలో ఉండరు. వాళ్ళందరూ రాయగడ పట్టణంలో ఇళ్ళు అద్దెలకి తీసుకుని తమ పిల్లల్ని ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లలో చఫివిస్తుంటారు. ఒక పోలీస్ స్టేషన్‌లో ఇద్దరుముగ్గురు ఇన్స్పెక్టర్లు ఉన్నప్పుడు వాళ్ళలో ఒకరిని ఇన్స్పెక్టర్-ఇన్-చార్జ్‌గా నియమిస్తారు. నేరస్తుణ్ణి అరెస్ట్ చేసినప్పుడు ఇన్స్పెక్టర్-ఇన్-చార్జే అతన్ని కోర్ట్‌లో హాజరుపరుస్తాడు. సి.ఆర్.పి.సి. చాప్టర్ 8 కేసుల నోటీసుల్ని కూడా ఇన్స్పెక్టర్-ఇన్-చార్జ్ ద్వారానే అందిస్తారు. అందువల్ల స్టేషన్ ఇన్-చార్జ్ తప్పకుండా స్టేషన్ ఉన్న గ్రామంలోనే నివాసం ఉంటాడు. సబ్-ఇన్స్పెక్టర్లూ, కానిస్టేబుళ్ళు మాత్రం స్టేషన్ ఉన్న గ్రామంలో నివాసముండరు. 

పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా పని చేస్తే మావోయిస్టులు కూడా పెరిగిపోరా అనే అనుమానం వస్తుంది. ఒరిస్సాలో మావోయిస్టుల్ని సి.ఆర్.పి.ఎఫ్.వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళు దొరికిన మావోయిస్టుల్ని పోలీస్ స్టేషన్ ఇన్-చార్జ్‌కి అప్పగిస్తారు. స్టేషన్ ఇన్-చార్జ్ వాళ్ళని సెల్‌లో చిత్ర హింసలు పెట్టి వాళ్ళ సహచరుల అడ్రెస్‌లు చెప్పమంటాడు. సి.ఆర్.పి.ఎఫ్.వాళ్ళు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న బారక్స్‌లోనే ఉంటారు. కనుక మావోయిస్టులనైతే పట్టుకోవడం ఒరిస్సా పోలీసులకి కష్టం కాదు. పోలీసులు జనానికి దూరంగా ఉండడం వల్ల దొంగతనాలు, రేప్‌లు, సి.ఆర్.పి.సి.107, 110 లాంటి కేసులు మాత్రం పెరుగుతాయి.  
Tags: State
Older posts are this way If this message doesn't go away, click anywhere on the page to continue loading posts.
Could not load more posts
Maybe Soup is currently being updated? I'll try again automatically in a few seconds...
Just a second, loading more posts...
You've reached the end.

Don't be the product, buy the product!

Schweinderl